భార్యపై అనుమానం.. ఇద్దరు కూతుర్లను చంపిన తండ్రి...
THE BULLET NEWS (JAGITYAL)-జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరి కూతుళ్లను గొంతు పిసికి చంపాడు. అసిఫాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీ అశోక్ అనే దంపతులు వారి పిల్లలు హన్సిక, హర్షితలతో కలిసి ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చారు. ఆదివారం ఇద్దరి పిల్లలకు నీళ్లు తాగిస్తానని భార్యతో చెప్పి పిల్లలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తల్లి వెతకగా పిల్లలు, భర్త కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అడవిలో గాలించగా ఒక పాప మృతదేహం లభ్యమైంది. మరొక పాప కోసం, పారిపోయిన తండ్రి గురించి పోలీసులు వెతుకుతున్నారు.
భార్యపై అనుమానం.. ఇద్దరు కూతుర్లను చంపిన తండ్రి...
Reviewed by ADMIN
on
April 17, 2018
Rating:
No comments: