లోకేష్, టీడీపీ అను కుల మీడియా పై పవన్ ఫైర్
THE BULLET NEWS -శ్రీరెడ్డి వ్యవహారం ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ నుంచి హఠాత్తుగా పవన్ కల్యాణ్ మీదకు మళ్లింది. పవన్ తల్లిని శ్రీరెడ్డి బూతులు తిట్టారు. ఆ తర్వాత వర్మ ఆమెతో అలా తిట్టించింది తానేని ప్రకటించారు. వర్మ వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందంటూ టీడీపీ అనుకూల మీడియానే పీలర్ వదిలింది. ఆ వెంటనే శ్రీరెడ్డి వెనుక వైసీపీ ఉందంటూ కథనాలు, ఒక లింక్ లేని ఆడియో టేపును ప్రసారం చేశాయి. ఇలా చేయడం ద్వారా ఒకవైపు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేస్తూనే.. మరో వైపు పవన్ వర్గీయుల్లో వైసీపీపై ఆగ్రహం రగిల్చాలన్నది మీడియా ఎత్తుగడ.
అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేరుగానే ఈసారి స్పందించడంతో టీడీపీ అనుకూల మీడియా ఎత్తులు పారలేదు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పవన్ కల్యాణ్ ట్వీట్టర్లో విరుచుకుపడ్డారు.
నారా లోకేష్, టీవీ9 రవిప్రకాశ్, ఏబీఎన్, మరికొన్ని టీడీపీ అనుకూల టీవీ చానళ్లపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొన్ని టీవీ చానళ్లు పచ్చి వ్యభిచారం చేస్తున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమం కంటే ఈ చానళ్లకు ఈ అంశమే ముఖ్యమైపోయిందని విమర్శించారు.
చంద్రబాబు గారు మీరు వీటిని కంట్రోల్ చేయరా అని ప్రశ్నించారు. ఒకప్పుడు దొరలంటే భూస్వాములని.. కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములేనని పవన్ ధ్వజమెత్తారు.వారు చెప్పిందే వేదం, వారు పాడిందే నాదం అని విమర్శించారు.
గత కొద్ది రోజులుగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగి తనను, తనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యకరంగా బూతులు తిట్టించారని మండిపడ్డారు. దానిపై తిరిగి చర్చలు పెట్టి మీ వారి ద్వారా సర్క్యూలేషన్‌లో పెట్టారని చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.
మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అండగా నిలబడినందుకు … ఏపీ సచివాలయం వేదికగా చేసుకుని మీ కొడుకు అతడి స్నేహివతుల ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, మరికొన్ని చానళ్లు, సోషల్ మీడియా ద్వారా నా మీద… నా కుటుంబం మీద నిరవధిక మీడియా అత్యాచారం చేయిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్‌పైకి వైసీపీనే శ్రీరెడ్డిని ఉసిగొల్పుతోందని టీడీపీ మీడియా ప్రచారం చేయగా.. పవన్ కల్యాణ్ పరోక్షంగా ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ వ్యవహారం నడుపుతున్నది లోకేష్, టీవీ9 రవిప్రకాశ్ అని పవన్ వెల్లడించారు. వర్మ అనే దర్శకుడు, టీవీ9 ఓనర్ శ్రీనిరాజు, టీవీ9 రవిప్రకాశ్ వీరు ముగ్గురి ద్వారా నారా లోకేష్ అతడి స్నేహితుడు… రాజేష్ కలిసి తనపై చేస్తున్నది చంద్రబాబుకు తెలియదంటే నమ్మలా అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారానికి అవసరమైన 10 కోట్ల రూపాయల డబ్బును టీవీ9 ఓనరే ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
టీవీ5 యాంకర్ సాంబశివరావు.. చిత్రపరిశ్రమలోని ఆడవాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పవన్ ట్వీట్ చేశారు. సదరు యాంకర్ సాంబశివరావును లోకేష్ ప్రేమగా అంకుల్ అంటూ సంబోధిస్తారని పవన్ చెప్పారు. పరోక్షంగా ఆడవాళ్లపై అంత పెద్ద బూతులు తిట్టిన యాంకర్ ఇంకా టీవీ చానల్ తెరపై కొనసాగుతున్నారంటే అందుకు లోకేష్ అండే కారణమని పవన్ తేల్చేశారు.
గతంలో అమ్మాయిలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి… కడుపైనా చేయాలంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇదే తరహాలో మీడియా ఎందుకు ట్రీట్ చేయలేదని ప్రశ్నించారు.
కేవలం పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ తల్లి విషయంలో మాత్రమే ఇలాంటి బూతు మాటలపై చర్చలు పెడుతారా … దీనిపై శ్రీమంతులైన, శక్తివంతులైన మీడియా యజమానులు చెప్పాలని పవన్ కల్యాణ్ నిలదీశారు.
మొత్తం మీద శ్రీరెడ్డి ద్వారా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని నాశనం చేసి.. ఆ తర్వాత నిందను వైసీపీ మీదకు మళ్లించేందుకు టీడీపీ మీడియా చేసిన ప్రయత్నాలు ఈసారి బెడిసికొట్టాయి. నేరుగా పవన్ కల్యాణే తనపై జరుగుతున్న ప్రచారం వెనుక ఎవరున్నారో చెప్పడం ద్వారా తన అభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చారు పవన్.

Reviewed by ADMIN
on
April 20, 2018
Rating:
No comments: