త్యాగాలు,ఉద్యమాలతోనే ప్రత్యేక హోదా సాధ్యం. - ఎమ్మెల్యే కోటంరెడ్డి
The bullet news ( Nellore) _ అడ్డంగా.. అన్యాయంగా రాష్టాన్ని విభజించి.. విభజన చట్టంలో ఉన్న హామీలను సైతం అమలు చేయకుండా కేంద్రం దుర్మార్గంగా వ్యహహరిస్తోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు..ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ కోటంరెడ్డి ఆధ్వర్యంలో విజయవం తమైంది.. రోడ్డు మీద బైఠాయించి ఫుట్ బాల్ ఆడి తన నిరసనను వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజన తో రాష్టానికి జరిగిన నష్టాన్ని భర్తీ చెయ్యాలంటే హోదా తప్పనిసరి అన్నారు.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రాకుంటే రాష్ట్రంలో అశాంతి నెలకునే అవకాశం ఉంటుందన్నారు.. వెంటనే హోదా ప్రకటించాలని డిమాండ్ చేసారు.. చంద్రబాబు దొంగ నాటకాలు కట్టిపెట్టి రోడ్డు మీదకు రావాలన్నారు..
త్యాగాలు,ఉద్యమాలతోనే ప్రత్యేక హోదా సాధ్యం. - ఎమ్మెల్యే కోటంరెడ్డి
Reviewed by ADMIN
on
April 16, 2018
Rating:
No comments: