ఎన్టీయార్ విదేశీ వైద్య విద్య పథకంలో "ఉక్రెయిన్" కూడా చేర్చండి - ఎమ్మెల్సీ వై.వి.బి రాజేంద్రప్రసాద్.
The bullet news (UYYURU)- పేద, మధ్యతరగతి ప్రతిభావంతులైన విద్యార్దులకు విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకం నిరుపేద విద్యార్దులకు వరంగా మారిందని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.. విదేశాల్లో చదువుకునే విద్యార్దులకు అన్ని దేశాలతో పాటు ఉక్రెయిన్ లో కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఆయన మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో, విదేశాల్లో చదువటానికి ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ఆర్దికసాయం చేస్తందన్నారు.. ఇదే సమయంలో విద్యార్థులకు ఆన్లైన్లో పొందు పరచినవి కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయని వాటిలో ఉక్రెయిన్ ను కూడా చేర్చాలని ఆయన కోరారు.. కృష్ణ జిల్లాలో ఎక్కువ మంది విద్యార్దులు ఉక్రెయిన్ లో చదవివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అందుకు అనుగుణంగా ఉక్రెయిన్ ను కూడా చేరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగు యువత నాయకులు కొండా ప్రవీణ్ కుమార్, ఎమ్. రాఘవేంద్రప్రసాద్, మరీదు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీయార్ విదేశీ వైద్య విద్య పథకంలో "ఉక్రెయిన్" కూడా చేర్చండి - ఎమ్మెల్సీ వై.వి.బి రాజేంద్రప్రసాద్.
Reviewed by ADMIN
on
October 31, 2017
Rating:
No comments: