కాస్త డిఫరెంట్ గా...
The bullet news (Kovvuur)- వినూత్న ప్రచారంలో ఎప్పుడూ ముందుండే ఎక్సైజ్ శాఖామంత్రి జవహర్ తనలోని మరో యాంగిల్ ను ప్రదర్శించారు.. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పకలరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేశారు.. ఇదే తరుణంలో కోవ్వూరు పట్టణంలోని ఓ మటన్ దుకాణంలోకి వెళ్లిన ఆయన విక్రయదారుని అవతారమెత్తారు.. మటన్ ను కట్ చేసి వినియోగదారులకు అమ్మారు..ఆశ్చర్యపోవడం అక్కడనున్న వారి వంతైంది.. ఓ మంత్రి ఇలా సామాన్య ప్రజల్లో మమేకవ్వుతూ ఉండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ రాష్టాభివృద్ది కోసం చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారన్నారు.. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని తన నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సమన్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతోందన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు..
కాస్త డిఫరెంట్ గా...
Reviewed by ADMIN
on
October 31, 2017
Rating:
No comments: