నెల్లూరు రూరల్ పీఎస్ లో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ
The bullet news (Nellore)-సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ నిర్వహించారు.. రూరల్ సిఐ దుర్గాప్రసాద్ ప్రతిజ్ణను చదివి వినిపించగా ఎస్ ఐ శేఖర్ బాబుతో పాటు సిబ్బంది ముక్తకంఠంతో ప్రతిజ్ణ చేశారు.. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు అంకితం అవుతానని, సమాజ సేవకు సత్య నిష్టతో ప్రతిజ్ణ చేస్తున్నామంటూ పోలీస్ సిబ్బంది ప్రతిజ్ణ నిర్వహించారు.. దివంగత నేత సర్ధార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, ఆచరించిన విధానాలతో సాధ్యమైన మన దేశ ఐక్యత, స్ఫూర్తితో ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నామని, మన దేశ అంతర్గత భద్రత నెలకొనడానికి నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు..
నెల్లూరు రూరల్ పీఎస్ లో జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ
Reviewed by ADMIN
on
October 31, 2017
Rating:
No comments: