భారతదేశం భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనం - ఉక్కుమనిషికి నివాళ్లర్పించిన బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కర్నాటి, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి
The bullet news (Nellore)-జాతిని ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయిపటేల్ ను గత పాలకులు తమ కుటుంబ స్వార్దం కోసం నిర్లక్ష్యం చేశారని బిజేపీ రాష్ట అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రడ్డి మండిపడ్డారు.. నగరంలో ఉన్న సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డితో పాటు పూలమాలలు వేసి ఆయన నివాళ్లర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం నవభారతదేశం నిర్మాణంలో వల్లభాయిపటేల్ ముఖ్యపాత్ర పోషించారన్నారు. వల్లబాయి పటేల్ 564 సంస్థానాలను ఏక తాటివరకు తీసుకొచ్చి ఈ దేశమంతా ఒక్కటే అని చాటి చెప్పిన ఘనత ఉక్కుమనిషి పటేల్ దేనన్నారు. ఒక రక్తపు బొట్టు చిందించకుండా దేశ సమైకత్యను ఒకే తాటిమీదకు తీసుకొచ్చారు.. స్వాతంత్ర్య అనంతరం ఆయన చేసిన సేవలను గత పాలకులు మరిచిపోయారన్నారు.
No comments: