కడుపులో కత్తెర... నెల్లూరు ప్రభుత్వ వైద్యుల నిర్వాకం..
THE BULLET NEWS (NELLORE)-విధులకు డుమ్మా కొట్టి ప్రయివేటు క్లినిక్స్ రన్ చేసుకోవటం.. అడిగిన వారిని ధిక్కరించడం.. రోగులను పట్టించుకోకపోవడం.. సస్పెండ్ చేసినా వారం లోపే విధుల్లో చేరడం, కడుపులో కత్తులు పెట్టి కుట్లు వెయ్యడం నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యులకు అలవాటుగా మారిపోయింది..
నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.. కడుపు నొప్పంటు వచ్చిన ఓ రోగికి ఆపరేషన్ చేసి కడుపులోనే పొడవాటి కత్తెరను మరిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
శ్రీకాకుళం జిల్లాకి చెందిన చలపతి కుటుంబం నెల్లూరు వచ్చి స్థిరపడింది.. చలపతి కి తరచుగా తీవ్రమైన కడుపు వస్తుండటంతో గత నెలలో పెద్దాసుపత్రి వైద్యులను సంప్రదించాడు.. 24 గంటల కడుపు అని చెప్పిన డాక్టర్లు ఆపరేషన్ చెయ్యాలని చెప్పడటంతో గత నెలలో ఆపరేషన్ చేపించుకున్నాడు.. డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో పొడవాటి కత్తెర ఉంచి కుట్లు వేశారు.. ఆపరేషన్ తరువాత కూడా కడుపు నొప్పి వస్తుండటంతో చలపతి మరోసారి డాక్టర్లను సంప్రదించాడు.. ఎక్సరే తీసిన డాక్టర్లు కడుపులో కత్తెర ఉండటాన్ని గమనించిన విషయం బాధితులకు సైతం చెప్పకుండా మరో మారు ఆపరేషన్ కి సిద్ధపడ్డారు. ఇవాళ మరోసారి ఆపరేషన్ నిర్వహించి కత్తెరను బయటికి తీశారు.. ఈ విషయం మీడియాకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. చివరకు మీడియాకి సమాచారం అందడంతో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Reviewed by ADMIN
on
October 30, 2017
Rating:
No comments: