వాళ్లపై వేటేస్తే.. అసెంబ్లీకొస్తాం... - సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
The bullet news (Muthukuru)- వైసీపీ గుర్తుతో గెలిచి అధికార పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తాము శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు.. ముత్తుకూరు మండలంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రతి ఇంట్లోని దేవుడి గదిలో వైఎస్సార్ ఫోటో ఎలా ఉంటుందో అలాగే ప్రతి మండల కేంద్రంలో వైసీపీ కార్యలయం ఉండేలా ప్రతి మండలంలో కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.. వైసీపీ జగన్మోహన్ రడ్డి పాదయాత్ర చేస్తుండటంతో చంద్రబాబు నాయుడికి దిక్కుతోచడం లేదని అందుకు వారి పార్టీ నేతల చేత చౌకబారు విమర్శలు చేయిస్తున్నారన్నారు.. ప్రజాసంకల్ప యాత్రంతో తెలుగుదేశం పార్టీ పునాదులు కదలడం ఖాయమన్నారు.. రాష్టంలో అనేక సమస్యలు విలయ తాండవం చేస్తుంటే ఆత్మస్తుతి పరనింద చందాన చంద్రబాబు అనైతిక పాలన కొనసాగిస్తున్నారన్నారు.. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని ఆయన సమర్దించుకున్నారు.. చట్టాలు చేసేటువంటి సభలో ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉండటం నచ్చకే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని వివరించారు.. చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.. తమ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ స్థాయిలో కూడా మేనిఫెస్టో ను రూపొందించుకుని వాటిని అమలు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాకాణి వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో నేతలు విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
వాళ్లపై వేటేస్తే.. అసెంబ్లీకొస్తాం... - సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
October 30, 2017
Rating:
No comments: