సీతారాముల కల్యాణ మండపం నిర్మాణానికి దొంతు శారదా దంపతులు రెండు లక్షల విరాళం
THE BULLET NEWS (VENKATAGIRI)- సమాజ సేవతో పాటు భగవంతుడు సేవలోను ముందుటామని మునిసిపల్ ఛైర్పర్సన్ దొంతు శారదా దంపతులు మరో సారి నిరూపించారు.. నిన్నగాక మొన్న మాతమ్మ గుడికి విరాళంతో పాటు నిర్మాణ అనంతర గుడికి పెయింట్స్ అందజేసిన వాళ్ళు తాజాగా వెంకటగిరి పట్టణంలో ఎన్టీయార్ కాలనిలో నూతనంగా నిర్మిస్తున్న సీతా రామ కల్యాణ మండపానికి రెండు లక్షలు విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు.. ఎన్టీఆర్ కాలనిలోని ఉన్న రామ మందిరంలో భర్త దొంతు బాలక్రిష్ణ తో చైర్ పర్సన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం కల్యాణ మండపం నిర్వాహకులు దాని నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేయాలని కోరగా స్పందించిన దంపతులు వెంటనే వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు... ఈ సందర్భంగా దొంతు శారదా, బాలకృష్ణ లను నిర్వాహకులు అభినందించారు..
సీతారాముల కల్యాణ మండపం నిర్మాణానికి దొంతు శారదా దంపతులు రెండు లక్షల విరాళం
Reviewed by ADMIN
on
October 23, 2017
Rating:
No comments: