సాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకురండి - ఎమ్మెల్యే కాకాణి
The bullet news (Podalakuru)- సాగునీటి సరఫరాలో రాజకీయాలు వద్దని రాజకీయాలకు అతీతంగా అందరికీ సక్రమంగా నీరందించేలా చూడాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. పొదలకూరు మీదుగా వెళుతున్న కండలేరు ఎడమగట్టు కాలువను బుధవారం ఆయన సంగం రోడ్డు వద్ద పరిశీలించారు. అనంతం కాకాణి మాట్లాడుతూ సాగునీటి కాలువలను నిరంతరం పర్యవేక్షిస్తూ పంటలు ఎండిపోకుండా కాపాడతానన్నారు.. సాగునీటి పంపిణీలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తనను నేరుగా సంప్రదించాలని రైతులను ఆయన కోరారు. నీరు చెట్టు పథకం ద్వారా ఏం పనులు చేశారో అర్థం కావడం లేదని కనీసం కాలువల్లో ఉన్న మొక్కలను చెట్లను కూడా తొలగించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర చరిత్రలో కాటన్ దొర తర్వాత వైఎస్ రాజశేఖరెడ్డి రైతుల గురించి ఆలోచించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసరమైన వాటికి వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని రైతుల కోసం మాత్రం ఏం ఖర్చు చేయడంలేదని ఆరోపించారు సంగం నెల్లూరు బ్యారేజీ పనులకు నిధులు విడుదల కా లేదని అధికారులు చెబుతున్నారని అన్నారు నీరు చెట్టు బదులు బ్యారేజీ పనులకు నిధులు విడుదల చేసి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర మంత్రులకు తమ శాఖలపై పట్టు లేదని విమర్శించారు, పొదలకూరు మండల దక్షుడు కె బ్రహ్మయ్య సర్పంచ్ తెనాలి నిర్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకురండి - ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
November 22, 2017
Rating:
No comments: