స్పందించినందుకు కృతజ్ణతలు మేడమ్ - చైర్ పర్సన్ కు కృతజ్ణతలు తెలిపిన సర్వోదయ కాలేజీ విద్యార్దులు
The bullet news (Venkata Giri)- ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి వచ్చిన వెంటనే వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ ఎలా స్పందిస్తారు విశ్వోదయ డిగ్రీ కాలేజీ విద్యార్దులకు అర్దమైంది.. సర్వోదయ డిగ్రీ కాలేజీలో చెట్లు విపరీతంగా పెరిగి తమకు తీవ్ర ఇబ్బందిగా ఉందని డిగ్రీ కాలేజీ విద్యార్దులు చైర్ పర్సన్ ను కలిసి విన్నవించుకున్నారు.. దీంతో స్పందించిన ఆమె ఇవాళ ఉదయం జేసీబీ సాయంతో చెట్లను తొలగించారు.. దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షించారు.. కాలేజీ ప్రాంగణంలో పనులను పర్యవేక్షిస్తున్న దొంతు శారదాను విద్యార్దులు కలిసి కృతజ్ణతలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె విద్యార్దులతో కాసేపు మాట్లాడారు.. కష్టపడి చదవి విద్యనభ్యసించిన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలన్నారు.. చదువు పరంగా ఎలాంటి ఇబ్బందులు తెలెత్తినా సమస్య పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు..
స్పందించినందుకు కృతజ్ణతలు మేడమ్ - చైర్ పర్సన్ కు కృతజ్ణతలు తెలిపిన సర్వోదయ కాలేజీ విద్యార్దులు
Reviewed by ADMIN
on
November 04, 2017
Rating:
No comments: