ఏపీలో మా బలమేంటో 2019 ఎన్నికల్లో చూపిస్తాం..- బిజేపీ రాష్ట అధికార ప్రతినిధి కర్నాటి
The bullet news (Nellore)_ త్రిపురలో అట్టడుగు స్థానం నుంచి కమ్యూనిస్టు కంచుకోటను బద్దలగొట్టే స్థాయికి ఎదిగాం... ఏపీలో కూడా మా బలమేంటో 2019 ఎన్నికల్లో చూపిస్తామని బిజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు.. నెల్లూరుజిల్లా బిజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీలకు ఈశాన్య రాష్టాల ఫలితాలు చెంపపెట్టులాంటివన్నారు.. రిగ్గింగ్ చేసుకునే వీలు లేకపోవడం వల్లే త్రిపురలో కమ్యూనిస్టులు ఓడిపోయారన్నారు.. ప్రతిపక్షం పెట్టబోతున్న అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్న కర్నాటి చర్చ జరిగితేనే ఏపీకి కేంద్రం ఎంత మేర నిదులిచ్చిందో ప్రజలకు తెలుస్తుందన్నారు.. పవన్ కళ్యాణ్ ఓ డిజేగా ఆయన అభివర్ణించారు.. పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవంలేదని నాటకాలు కట్టిపెట్టి కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి సూచించారు..
ఏపీలో మా బలమేంటో 2019 ఎన్నికల్లో చూపిస్తాం..- బిజేపీ రాష్ట అధికార ప్రతినిధి కర్నాటి
Reviewed by ADMIN
on
March 04, 2018
Rating:
No comments: