వసూళ్లతో సంపన్నులు
The bullet news(nellore)- పురపాలక సంఘాల్లో స్థానిక వనరుల ద్వారా వచ్చే ఆదాయనికి క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శించి రాబడికి భారీ గండి కొడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పన్ను వసూళ్లకు ఇటీవల ప్రభుత్వం నూతన సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నప్పటికీ అక్రమ వసూళ్లకు తెరపడటం లేదు. స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులను తమ ఆదాయ మార్గాలుగా మార్చుకొని రాబడికి శఠగోపం పెడుతున్నారు. జిల్లాలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, కావలి పురపాలక సంఘాలతోపాటు నెల్లూరు నగరపాలక సంస్థ ఉన్నాయి. పట్టణాల్లో శివారు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములను స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేసి అనేక కొత్త డిజైన్లతో భారీ భవంతులు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. వీటి అన్నింటికీ¨ పురపాలక శాఖ నిబంధనల మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. పట్టణాల్లో పన్ను వసూలు చేసేందుకు అనుభవం కలిగిన అధికారులు, సిబ్బంది లేక పోవడంతో అక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఉన్న పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలో ఏడాదికి పన్ను రూపేణ రూ.95.3 కోట్ల మేరకు డిమాండ్ ఉంటుంది. అధికారులు, క్షేత్రస్థాయిలో సిబ్బంది చేస్తున్న అక్రమాలతో కేవలం రూ.30.47 కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నారు.
* కొత్తగా నిర్మించే నివాస, వాణిజ్య భవనాలకు పలువురు పురపాలక, నగరపాలక సంస్థలో ఉన్న రెవెన్యూ సిబ్బంది వన్ను విధింపులో చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు.
* భవననిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
* క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సంబంధిత అధికారుల వరకు ఈ మొత్తాలు వాటాలుగా వెళుతున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భవన యజమానులు రెవెన్యూ సిబ్బంది అడిగిన మేరకు డబ్బు ఇస్తున్నారు.
* భవన నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి అస్తిపన్ను విధిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పన్ను విధించే అధికారులు, సిబ్బంది భవనం పొడవు, వెడల్పు తగ్గించినప్పుడు వార్షిక పన్ను విలువ కూడా తగ్గాలి.
* ఖరీదైన గ్రానైట్ రాళ్లను , ఇతర నిర్మాణ సామగ్రి వినియోగిస్తే సాధారణం కంటే ఎక్కువ పన్ను విధించాలి. అయితే ఇలాంటి భవనాల యాజమానులతో మాట్లాడుకొని సాధారణ పన్ను ధరలు వర్తింపచేసే సౌలభ్యం కల్పిస్తున్నారు.
* నాలుగు అంతస్తుల భవనాన్ని రెండంతస్తులుగా చూపించి పన్ను విధించడం, అన్ని ఫ్లోర్లకు కలిపి ఒకే అసెస్‌మెంటు కింద పన్ను వేసి రెవెన్యూ అధికారులు, సిబ్బంది భవన యాజమానులకు సహకరిస్తున్నారు.ఈ విధంగా పన్ను విధించి జేబులు నింపుకొంటున్నారు.
* భవనాలను కచ్చితమైన కొలతలు తీసి పన్ను విధిస్తే వసూళ్ల డిమాండ్ పెరుగుతుందని ఎక్కడికక్కడ మమూళ్లు తీసుకొని పాత పన్ను డిమాండ్ లెక్కలనే ప్రభుత్వానికి చూపిస్తూ పురపాలక సంఘాల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏడాది పొడవునా పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్ల పట్ల నిర్లక్ష్యం వహించే బిల్లు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరం చివర్లో హడావుడి చేసి ప్రభుత్వ ఒత్తిడితో పన్ను వసూలు చేయడం జరుగుతుంది. దీని వలన కూడా అనేక అక్రమాలు చోటు చేసుకొంటున్నాయి. పది నెలల కాలవ్యవధిలో వసూలు కానటువంటి పన్నుకు మార్చి నెలలో హడావుడి చేస్తున్నారు. ఆస్తి పన్ను విధింపు సక్రమంగా నిర్వహిస్తే ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం ఉంది.
భవన నిర్మాణానికి వినియోగించిన సామగ్రి, గ్రానైట్ రాళ్లు, కలప విలువను గుర్తించి ఆస్తి పన్ను నిర్ణయించాల్సి ఉంటుంది. పురపాలక సంఘం కమిషనర్, రెవెన్యూ అధికారులు భవనాలు తనిఖీ చేసి కొలతల ఆధారంగా పన్ను వసూలు చేయాలి. ఇలా కాకుండా విలువైన సామగ్రితో నిర్మించిన భవనాలకు సాధారణ పన్ను విధించే అవకాశం లేదు. ఇలాంటి భవనాలు ఉంటే ప్రత్యేక అధికారుల ద్వారా పరిశీలించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటాం.జిల్లాలో కొత్తగా నిర్మించిన భవనాల అకృతులు పరిశీలిస్తా. అక్రమాలకు పాల్పడే రెవెన్యూ అధికారులపై చర్యలు తప్పవు.
* నాయుడుపేట పట్టణంలో ఇటీవల ఇద్దరు యజమానులు మూడు అంతస్తుల భవనాలు నిర్మించి బ్యాంకులకు అద్దెకు ఇచ్చారు. వీటికి ఖరీదైన గ్రానైట్ ఫలకలు అమర్చారు. ఈ భవనాలకు ప్రత్యేకంగా అదనపు పన్ను వసూలు చేయాల్సి ఉండగా సాధారణ పన్ను వసూలు చేస్తున్నారు. ఓ చోటా నాయకుడు ఆధునిక హంగులతో భవనం మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించారు. దీనికి కూడా సాధారణ పన్ను రుసుం కంటే రెండింతలు అద]నంగా విధించాల్సి ఉంది. రాజకీయ పరపతి ఉండటంతో సాధారణ పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు.ఇలాంటివి పట్టణంలో వందల సంఖ్యలో ఉన్నాయి.
* నెల్లూరు నగరపాలక సంస్థలో ఏడాది కిందట కొత్తగా నిర్మించిన భవనాలకు, ఖాళీ స్థలాలకు పన్ను విధింపులో భారీ అక్రమాలు చోటు చేసుకొన్నాయి. ఈ విషయంలో బదిలీ అయిన ఒక అధికారి మళ్లీ వెనక్కి వచ్చి 71 అసెస్‌మెంట్లకు నిబంధనలకు విరుద్దంగా తక్కువ పన్ను విధించి భవన యాజమానులకు లబ్ధి చేకూర్చే రీతిలో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. ఇందులో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
* గూడూరు, కావలి పట్టణాల్లో ఎక్కువ శాతం భవనాలను గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఇవి కాకుండా శివారు ప్రాంతాల్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు గ్రానైట్ రాళ్లతో నిర్మాణం చేశారు. ఈ భవనాలన్నింటికీ సాధారణ ఇంటి పన్నులే వసూలు చేస్తూ రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
* రెండేళ్ల కిందట సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఆస్తి పన్ను మదింపులో అనేక లోపాలు చోటుచేసుకోవడంతో చివరికి పురపాలక సంఘంలో ఉన్న కొందరు కౌన్సిలర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాల్లో అధికారులతో వాదనకు దిగడం జరిగింది.

Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: