తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా చంద్రగిరి
The bullet news(chandragiri)- చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రైల్వేస్టేషన్ మహిళా రైల్వేస్టేషన్‌గా అవతరించింది. ఇక్కడి కార్యకలాపాల నిర్వహణ మొత్తం వారికే అప్పగించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ మంగళవారం ఈ స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం చంద్రగిరిని మహిళా రైల్వేస్టేషన్‌గా ప్రకటించిందని తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్‌ను సైతం ఈ విభాగంలో ఎంపిక చేశామన్నారు. దేశంలో మహిళా రైల్వేస్టేషన్లుగా తొలుత ముంబయి, మధ్యప్రదేశ్‌లోని మాతంగి రైల్వేస్టేషన్లను గుర్తించారని వివరించారు. రాష్ట్రంలో మరో ఆరు డివిజన్లలోనూ ఒక్కో స్టేషన్ చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రగిరి రైల్వేస్టేషన్ తిరుపతికి సమీపంలోని అతి చిన్నది కావడంవల్ల అతితక్కువ మంది సిబ్బందితో మహిళా విభాగంలో తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం విజయ్‌ప్రతాప్‌సింఘ్, మహిళా రైల్వేస్టేషన్ అధికార సిబ్బంది పాల్గొన్నారు.
తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా చంద్రగిరి
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: