అకట్టకటా.. ఏమి అక్రమాలు
The bullet news(nellore)- చెరువు కట్టను పటిష్టపరిచి రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు. నెల్లూరు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నీటి నిల్వ సామర్థ్ద్యం పెంపు. ఈ రెండు పనులకు గాను రూ.కోట్ల ఖర్చుతో నీరు-చెట్టు కింద నెల్లూరు చెరువు కట్టను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిబంధనలను అమలు చేయాల్సిన నీటి పారుదల శాఖ ఇంజినీర్లు వాటాలు వేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు. చెరువు కట్టను(బండ్) కట్టుదిట్టం చేసేందుకు మొదట మట్టివేసి దానిని రోలింగ్ ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నిబంధనలు పక్కన పెట్టి మట్టిలో కాసుల వేటలో ఇంజినీర్లు, గుత్తేదారులు పరుగులు తీస్తున్నారు. Rs2.48 కోట్ల జరుగుతున్న పనుల్లో నీటి పారుల శాఖ పర్యవేక్షణ, గుత్తేదారుల నాణ్యతపై కథనం
జారిపోతున్న కట్ట.. చెరువు పొర్లుకట్ట పూర్తిగా ధ్వంసం కావడంతో దీనిని ఆధునికీకరించేందుకు నీటి పారుదల శాఖ నీరు-చెట్టు కింద పనులకు శ్రీకారం చుట్టారు. ఆయకట్టుకు, నెల్లూరు ప్రజలకు నీటి ఎద్దడి తీర్చేందుకు తొలిదశలో Rs.50లక్షలతో పనులు చేశారు.అయితే చెరువు పాత కట్టపై వేసిన మట్టి చిన్నపాటి వర్షానికే జారిపోతోంది.ప్రస్తుతం నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం కట్ట పనులను Rs 1.98కోట్లతో చేపట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. నీరు- చెట్టు కింద రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు చెరువును అభివృద్ధి చేసేందుకు కేటాయించిన నిధులు మట్టిపాలు అవుతున్నాయి. నీటి పారుదల శాఖ చేపట్టిన పనుల్లో మొదటి దశలో చెరువు కట్టను(బండ్) పటిష్ట పరుస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ డివిజన్ పర్యవేక్షణలో మెదట Rs.50 లక్షలు, తరువాత Rs.1.98 కోట్లతో చెరువు కట్టలను పటిష్ట పరిచేందుకు ప్రధాన గుత్తేదారునికి పనులు అప్పగించారు. అయితే జరుగుతున్న పనులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పర్యవేక్షణ లోపం, ఇంజినీర్ల ఉదాసీన వైఖరీతో పాత కట్టలపైనే చెరువులోని మట్టినే తెచ్చి వినియోగిస్తున్నారు. వీటిపై గ్రావెల్ పరిచి రోలింగ్ లేకుండానే చక్కపెడుతున్నారు. పూర్తయిన మట్టికట్టలు మధ్య భాగంలో అప్పుడే పగిలిపోతున్నాయి. బండ్ పటిష్ట పరిచేందుకు జరుగుతున్న మట్టి కట్టలు పగుళ్లతో కుంగిపోతున్నాయి. * బలహీనంగా ఉన్న కట్టను పటిష్ట పరిచే పనులను ప్రధాన గుత్తేదారు ఉప గుత్తేదారునికి ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నాయి. * అయితే ఇక్కడ పనులు దక్కించుకున్న ప్రధాన గుత్తేదారు రమేష్‌కుమార్ మరో ఇద్దరు ఉప గుత్తేదారులకు అప్పగించినట్లు ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు. * రూ. కోట్ల విలువైన పనులను నాణ్యతా ప్రమాణాలు, సాంకేతికతతో చేయాల్సి ఉంది. * పాత కట్టపైనే చెరువులో తవ్విన మట్టిని వేయడంతో పగుళ్లిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే మట్టి కరిగిపోయి సమీపంలో ని రోడ్డుపైకి చేరుతోంది. * ఉదాహరణకు నెల్లూరు నగరానికి సమీపంలో ఉపగుత్తేదారు 900 మీటర్లు పొడవున కట్ట పనులు చేపట్టారు. పనులు పూర్తి కాకముందే కట్ట రూపు కోల్పోతోంది. * మరో వైపు రూ. కోటి వ్యయంతో మూడు కిలోమీటర్ల మేర కట్ట పనులు జరుగుతున్నాయి. కేవలం చెరువులోని మట్టినే ఒక యంత్రంతో కట్టలను నింపేసి సాధారణ రోలర్ తిప్పుతున్నారు. పాతకట్టను మధ్యలో తవ్విన తరువాత మట్టి వేసి పొరలు పొరలుగా రోలర్‌తో తొక్కించాల్సి ఉంది. * క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మాత్రం నిబంధనల మేరకే పనులు జరుగుతున్నాయని, వీటిని నిత్యం సెంట్రల్ డివిజన్ ఈఈ పర్యవేక్షణ చేస్తారని పేర్కొంటున్నారు.
నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయి. ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కట్ట పనుల్లో నాణ్యత పాటించాలని నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం. పగుళ్లు వస్తుంటాయి. వాటిని సరిచేస్తాం. మట్టిపనులు అలాగే ఉంటాయి. ప్రధాన గుత్తేదారు ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ రమేష్ కుమార్ పేరుపై మాత్రం పనులు జరుగుతున్నాయి.
నీటి పారుదల శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న చెరువు కట్ట పనుల్లో నిబంధనలు తూ.చ అమలు చేయాల్సిందే. క్షేత్రస్థాయిలో ఏఈ పర్యవేక్షణ నిత్యం ఉంటుంది. ప్రధాన గుత్తేదారే పనులు చేయాల్సి ఉంది. ఎక్కడా ఇతరులకు అప్పగించకూడదు. నిబంధనలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుని తిరిగి పనులు చేయిస్తాం.

Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: