మళ్లీ తెరమీదకు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం.. ఎమ్మెల్యే కోటంరెడ్డికి నోటీసులు
The bullet news (Nellore)_ నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది.. వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ జిల్లా ఎస్పీ పిహెచ్ డీ రామకిష్ణ నోటీసులు జారీ చేశారు.. ఇవాళ ఉదయం గం.7.30కి విచారణకు హాజరుకావాలని రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి స్వయంగా రూరల్ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి నోటీసు అందజేశారు.. దీనిపై స్పందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగంగానే నాకు నోటీసులు మరోసారి అందజేశారని ఆయన మండిపడ్డారు.. ఇవాళ వైసీపీ అబ్యర్ది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఉన్నపళంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేయం కక్షసాదింపు చర్యలో భాగమేనన్నారు.. ఇదే సమయంలో ఎస్పీ రామకిష్ణ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శుల చేశారు.. పిహెచ్ డీ రామకిష్ణ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.. నోటీసులు అందజేసిన నేపథ్యంలో రేపు విచారణకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు..
మళ్లీ తెరమీదకు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం.. ఎమ్మెల్యే కోటంరెడ్డికి నోటీసులు
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: