Top Ad unit 728 × 90

గృహిణి చేతిలో అందమైన కళాకృతులు

The bullet news (Nellore)-  నెల్లూరు నగరం చిల్డ్రన్స్‌పార్కు ప్రాంతంలో ఉంటున్న పాబోలు సుబ్రహ్మణ్యం, శారదామణి దంపతులు. శారదామణికి చిన్ననాటి నుంచి బొమ్మలంటే ఇష్టం. ఇదే ఆమెలో బొమ్మలు తయారు చేయాలనే ఆలోచనకు పురికొల్పొంది. బీకామ్‌ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఈమెకుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే.. ఖాళీ సమయాల్లో పనికిరాని వస్తువులతో బొమ్మలు తయారు చేయడాన్ని అలవాటు చేసుకున్నారు. వాడి పడేసే ఖాళీ వాటర్‌ బాటిల్స్‌, కొబ్బరి చిప్పలు, అట్టలు ఇలా దేనినైనా బొమ్మలకు ముడిసరకుగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో క్విల్లింగ్‌ పేపర్‌, జనపనారతో వినూత్నమైన ఆకృతులను తయారు చేయడం ప్రారంభించారు. చిన్నారులకు ఇష్టమైన డోరోమెన్‌, మిక్కీ మౌస్‌, స్పైడర్‌మేన్‌ వంటి బొమ్మలను జనపనారతో వారి ముందే తయారు చేసి.. ఆ కళపై వారిని ప్రోత్సహిస్తున్నారు. ఆమెవద్ద శిక్షణ పొందిన చిన్నారులు పలు ప్రదర్శనలలోపాల్గొన్నారు.జాతీయస్థాయిలోనూ బహుమతులను సాధించారు.

క్విల్లింగ్‌ పేపర్స్‌తో ప్రత్యేకంగా..
అసలు క్విల్లింగ్‌ పేపర్‌ అనేది మనకు తెలియదు. దీన్ని వాస్తవంగా ఫొటోఫ్రేమ్‌లు, బంగారు ఆభరణాల తయారీ తదితర వాటిల్లో ఉపయోగిస్తారు. కళలో తనకంటూ ప్రత్యేకత సాధించాలనే ఉద్దేశంతో.. క్విల్లింగ్‌ పేపర్స్‌తో ఎలాంటి ఆధారం లేకుండా బొమ్మలను అలవోకగా తయారు చేస్తున్నారు. జపనీస్‌ డాల్స్‌, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, శ్రీకృష్ణుడు, దశావతారాలు, జాతీయ జెండా, డోరోమెన్‌, మిక్కీ మిన్నీ, మీనియేచర్‌ కిచెన్‌, ఫ్లోటింగ్‌ ఫ్లవర్స్‌ ఇలా 250 వరకూ బొమ్మలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. ఇవన్నీ తమ ఇంట్లోని అద్దాల ర్యాకులలో పొందుపరిచి ఉన్నారు. సాధారణంగా ఇళ్లలో అందంగా ఉండేందుకు పలు రకాల బొమ్మలను, పూలను మార్కెట్లో కొనుగోలు చేసి.. అమర్చుకుంటాం. కానీ ఆమె మాత్రం తాను తయారు చేసిన ప్రతీ బొమ్మను ర్యాకులలో ఉంచి.. ఇంటికీ కొత్త అందాన్ని తీసుకొస్తున్నారు. అద్భుతమైన కళతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. శారదామణి తయారు చేసిన బొమ్మలను చూస్తే.. ఔరా అనకమానరు. ఈ బొమ్మలను మాత్రం అమ్మడానికి కాదని.. తన అభిరుచి కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

అంతర్జాతీయ అవార్డులు సొంతం
క్విల్లింగ్‌ పేపర్స్‌తో బొమ్మలను తయారు చేస్తూ.. ప్రత్యేకత చాటుకుంటున్న శారదామణిని పలు అంతర్జాతీయ అవార్డులు వరించాయి.

ప్రతిష్ఠాత్మకమైన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం పొందారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, రికార్డ్‌ హోల్డర్స్‌ రికార్డు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు, గోల్డన్‌ స్టార్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు వంటి ఆరు అంతర్జాతీయ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.

క్విల్లింగ్‌ డాల్స్‌నే కాకుండా.. క్విల్లింగ్‌ జ్యూవెలరీని సైతం రూపొందిస్తున్నారు. వీటి తయారీపై ఆసక్తి ఉన్న అమ్మాయిలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.

ముఖ్యంగా అనాధ శరణాలయాల్లో ఉండే చిన్నారులకు ఈ కళను ఉచితంగా నేర్పి.. వారి జీవనోపాధికి తోడ్పడుతున్నారు. వినూత్నమైన కళా ప్రతిభను కలిగి ఉన్న శారదామణికి.. ఈటీవీ నుంచి రెండు పర్యాయాలు ఆహ్వానం లభించింది. తొలిసారి మహిళలు- మహారాణులు గేమ్‌ షోలో పాల్గొని విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఈటీవీలో వచ్చిన ‘పరిపూర్ణ మహిళ’ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ కనబరిచారు. 

* 2017లో సింహపురి మ్యాజిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కళా విశారద అవార్డును అందుకున్నారు.
* 2016లో కళాదీప్తి అవార్డును స్వీకరించారు. ఆ గృహిణి అద్భుతమైన కళా ఖండాలను ఆవిష్కరిస్తోంది.. పనికిరాని వ్యర్థాలతో అర్ధవంతమైన బొమ్మలను తీర్చిదిద్దుతోంది.. కళ్ల ముందు కనిపించే ఏ వస్తువైనా.. ఆమె చేతిలో ఆట వస్తువుగా మారాల్సిందే.. ఫొటో ఫ్రేమ్‌లు, బంగారు ఆభరణాల తయారీలో ఉపయోగించే క్విల్లింగ్‌ పేపర్స్‌తోనే వందలాది బొమ్మలను తయారు చేసి ఈ కళతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పోటీ పడేవిధంగా ఇవి ఉంటున్నాయి.. నెల్లూరు నగరానికి చెందిన పాబోలు శారదామణి సరాదాగా ప్రారంభించిన చిరు ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ రికార్డులలో స్థానం దక్కించుకుంది.
గృహిణి చేతిలో అందమైన కళాకృతులు Reviewed by ADMIN on March 07, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.