చంద్రబాబుకు సాధ్యం కాని హోదాని మా నాయకుడు తీసుకొస్తాడు..- రహదారుల దిగ్బంధంలో ఎమ్మెల్యే కాకాణి.
THE BULLET NEWS (VENKATACHALAM)-ప్రత్యేకహోదా సాధన సమితి పిలుపులో భాగంగా నెల్లూరుజిల్లాలో జాతీయరహదారులపై రాకపోకలు స్తంబించాయి.. వెంకటాచలం జాతీయరహదారిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన రహదారుల దిగ్బందం అరెస్టులకు దారి తీసింది.. వైసీపీ శ్రేణులు నిరసనలో భారీగా పాల్గొన్నారు.. ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.. చంద్రబాబు నాయుడి వల్ల హోదా ఆలస్యమవుతోందన్నారు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం పెట్టి జాతీయ రాజకీయాల్లో సంచలనం కల్గించిన నాయకుడు జగన్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డితోనే హోదా సాధ్యమన్నారు.. ఈ సమయంలో ట్రాఫిక్ భారీగా స్థంభించడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మెల్యే కాకాణిని అరెస్టు చేసేందుకు యత్నించారు.. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. చివరికి కాకాణి అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు..
చంద్రబాబుకు సాధ్యం కాని హోదాని మా నాయకుడు తీసుకొస్తాడు..- రహదారుల దిగ్బంధంలో ఎమ్మెల్యే కాకాణి.
Reviewed by ADMIN
on
March 22, 2018
Rating:
No comments: