జగన్‌కు షాకిచ్చిన బూచేపల్లి
The bullet news (Darshi)_
దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టరు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పార్టీ అధినేత జగన్ నిర్ణయంతో అసంతృప్తికి గురయ్యారు. దర్శి నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా బాదం మాధవరెడ్డి పేరును ప్రకటించడంపై తన వ్యతిరేకతను నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాళ్లూరు సభలో మాధవరెడ్డి పేరును జగన్ ప్రకటించడం తనను అగౌరవపరచడమేనంటూ బూచేపల్లి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొందరు అనుచరులతో కలిసి జగన్ సంకల్పయాత్ర భోజన విరామ సమయంలో బాలినేనిని బూచేపల్లి కలిశారు. ఎప్పుడూ నిబ్బరంగా కనిపించే బూచేపల్లి ఆవేశంగా మాట్లాడినట్లు తెలిసింది.
మాధవరెడ్డి నియామకంపై అసంతృప్తిని వ్యక్తం చేసి ఆ విషయాన్ని వెల్లడించిన నేపథ్యాన్ని కూడా ఆక్షేపించినట్లు తెలుస్తుంది. దర్శి నియోజకవర్గానికి చెందిన కొందరు అనుచరులతో కలిసి వెళ్లిన బూచేపల్లి ఆ తర్వాత ముండ్లమూరు వెళ్లి మరికొందరు అనుచరులతో ముచ్చటించడం వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయోనంటూ వ్యాఖ్యానించడం, తాను పోటీలో ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం చర్చనీయాంశాలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని బూచేపల్లి కుటుంబం జగన్‌కు చెప్పడం, తదనంతరం మాధవరెడ్డిని సమన్వయకర్తగా ఎంపిక చేయడం తెలిసిందే. మాధవరెడ్డి ఎంపిక పట్ల అసంతృప్తితో ఉన్న శివప్రసాద్‌రెడ్డితో పలువురు పార్టీ నేతలే కాగా జగన్ కూడా మాట్లాడారు. శనివారం ఉదయం పాదయాత్ర శిబిరంలో కూడా జగన్ అటు మాధవరెడ్డి, ఇటు బూచేపల్లితో మాట్లాడారు.
అనంతరం తాళ్లూరు సభలో జగన్ మాధవరెడ్డి పేరును ప్రకటించారు. ఆదివారం అసంతృప్తిని వ్యక్తం చేసిన బూచేపల్లి అంతకుముందు జగన్ స్వయంగా మాధవరెడ్డి ఎంపికను ప్రస్తావించినప్పుడు మూడునాలుగు నెలలు వేచి చూడాలని చెప్పినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో అయోమయం ఉండకూడదని అంటూ జగన్ మాధవరెడ్డి పేరును ప్రకటిం చారు. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన బూచేపల్లి కుటుంబ సభ్యులు చర్చించుకున్న అనంతరమే శివప్రసాద్‌రెడ్డి ద్వారా అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తానని బాలినేని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
అనంతరం ముండ్లమూరులో కార్యకర్తలను కలిసి కూడా అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. అయితే తాళ్లూరులో జగన్ సభ జయప్రదం కావడం, మాధవరెడ్డి పేరును నేరుగా జగనే ప్రకటించిన నేపథ్యంలో తిరిగి వెనకడుగు వేసే పరిస్థితి ఉండదని ఆ పార్టీ వర్గాల అంచనా. ఈ దశలో బూచేపల్లి కుటుంబ సభ్యులను అధిష్టానం శాంతింప చేయగలుగుతుందా లేక వారు తీవ్రమైన అవకాశం ఉంటుందా అనేది వేచిచూడాల్సిందే.
జగన్‌కు షాకిచ్చిన బూచేపల్లి
Reviewed by ADMIN
on
March 05, 2018
Rating:
No comments: