బ్యాంకు ఉద్యోగులే దొంగలు.. దోచేస్తున్నారు డబ్బంతా
The bullet news (Business news)- ష్టపడి దాచుకున్న సొమ్ము ఇంట్లో పెట్టుకుంటే దొంగలు దోచేస్తారేమోనని బ్యాంకులో పెట్టుకుంటారు. పిల్ల పెళ్లికో, కొడుకు చదువుకో ఉపయోగపడుతుందని సగటు బడుగు జీవి ఆశపడుతుంటాడు. ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినా పెట్టిన సొమ్ముకి భద్రత ఉంటుందని ధీమాతో ఉంటాడు. కానీ వస్తున్న వార్తలు చూస్తుంటే చిన్న దొంగలు ఇళ్లు దోచుకుంటే గజ దొంగలు బ్యాంకుల్ని, దేశాన్నే దోచేస్తున్నట్టున్నారు. సగటున ప్రతి 4 గంటలకూ ఓ బ్యాంకు దొంగతనం జరుగుతున్నట్లు సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే లెక్కలు కట్టింది. గత మూడేళ్ల కాలంగా బ్యాంకులు నష్టపోయిన సొమ్ము రూ.66 వేల కోట్లని లెక్కలు కట్టి మరీ చెబుతోంది. రాష్ట్రాల వారీగా బ్యాంకుల్లో జరిగిన మోసాలు చూస్తే సొమ్ము ఎక్కడ దాచుకోవాలో అర్ధం కాని పరిస్థితి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు చీమ కుట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తుంది.
రాష్ట్రం నష్టం విలువ కోట్లలో
తమిళ నాడు 83.00
తెలుగు రాష్ట్రాలు 148.41
కర్ణాటక 89.34
మహారాష్ట్ర 110.43
కేరళ 30.53
రాజస్థాన్ 1,096.00
చండీగఢ్ 253.44
ఢిల్లీ 188.22
పశ్చిమ బెంగాల్ 167.00
ఇతర బ్యాంకులు 241.53
బ్యాంకు ఉద్యోగులే దొంగలు.. దోచేస్తున్నారు డబ్బంతా
Reviewed by ADMIN
on
March 03, 2018
Rating:
No comments: