Top Ad unit 728 × 90

ఆయన మంచోడే కానీ, ఫలితం ఎందుకు తారుమారైంది ?

The bullet news (Political)- ఆయన అధ్బుతమైన పాలన, ఓటమిని ఆపలేకపోయింది. ఆయన నిరాడంబరత, అపజయాన్ని నిలువరించలేకపోయింది. ఆయన దీక్షాదక్షత కాషాయ విజయధ్వజాన్ని కట్టడి చేయలేకపోయింది. ఆ‍యన దేశంలోనే సింపుల్‌ సీఎం మాణిక్‌ సర్కార్. త్రిపురు రెండు దశాబ్దాలు ఏలిన సాధారణ సీఎం. బీజేపీ విజయాన్ని ఆపలేకపోయిన కమ్యూనిస్టు యోధుడు. అసలు మాణిక్‌ సర్కార్‌ జీవితం ఎలా సాగింది...ఈ పరాజయానికి ఆ‍యన ఎంతవరకు బాధ్యులు...ఆయన మంచోడే కానీ, ఫలితం ఎందుకు తారుమారైంది...

1949 జనవరి 22న త్రిపురలోని ఉదయపూర్‌లో జన్మించారు మాణిక్‌ సర్కార్ తండ్రి అమూల్య సర్కార్, టైలర్. తల్లి అంజలి ప్రభుత్వ ఉద్యోగి. స్థానిక ఎంబీబీ కాలేజ్‌లో బీ.కాం చదివారు. విద్యార్థి దశలోనే విప్లవ భావాల సర్కార్, 1967 కాంగ్రెస్‌ వ్యతిరేక పోరులో చురుకుగా పాల్గొన్నారు. అదే ఏడాది అంటే 19 ఏళ్ల వయస్సులో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అక్కడి నుంచి ఎర్రజెండా పట్టుకుని చెలరేగిపోయారు. మాణిక్‌ సర్కార్‌, లెఫ్ట్‌ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతో ఆ‍యనను అన్ని విధాలుగా ప్రోత్సహించింది పార్టీ. 1972లో సి.పి.ఎం రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత
1978లో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది అంటే, 1978లోనే తొలిసారి త్రిపురలో అధికారంలోకి వచ్చింది సీపీఎం.

ఉద్యమాల నుంచి శాసన సమరంలోకి దూకారు మాణిక్‌ సర్కార్. 1980లో అగర్తాల నుంచి తొలిసారి శాసస సభ్యుడిగా విజయం సాధించారు. 1983లో కృష్ణ నగర్, అగర్తాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారు. అదే సంవత్సరం, అంటే 1998లో త్రిపుర ముఖ్యమంత్రిగా రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టారు మాణిక్‌ సర్కార్.
సీఎంగా ఆ‍యన దైనదైన ముద్ర వేశారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపట్టారు. పాతికేళ్ల సీపీఎం పాలనలో 20 ఏళ్లు మాణిక్ సర్కారే రాష్ట్రాన్ని ఏలారు.

ముఖ్యమంత్రిగా ఆడంబరాలు, పదుల కొద్ది వాహనాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎంలు మనదేశంలో ఎక్కువ. కానీ అత్యంత సాధారణ సీఎం మాణిక్‌ సర్కార్. ఏమాత్రం ఆడంబరాలు ఇష్టపడని సాధారణ ముఖ్యమంత్రి. తన పేరు మీద ఇల్లు లేదు, కారు లేదు. రిక్షాలోనే సెక్రటేరియట్‌కు వస్తారు. అనవసర ఖర్చులు పెట్టరు. మాణిక్ సర్కారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా కేవలం 2,410. చేతిలో ఖర్చుల కోసం 15,20 మాత్రలో పెట్టుకుంటారు. మాణిక్ సర్కార్ భార్య పేరు పంచాలి భట్టాచార్య. ఆమె 2011లో కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. భార్యగా ఆమె జీవితం కూడా సాధారణం.

మాణిక్‌ సర్కార్ మంచోడే కానీ, చుట్టూ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుపు చొక్కాను నలుపు చేశారు. మంత్రులందరూ అవినీతిలో మునిగిపోయారు. వారిని కంట్రోల్ చేయడం, దారిలో పెట్టడం మాణిక్‌ సర్కారు విఫలమయ్యాడనే చెప్పాలి. మితిమీరిన మంచితనాన్ని, చేతగానితనంగా మంత్రులు, అధికారులు అలుసుతీసుకుని, ఆయనకు బ్యాడ్‌నేమ్ తెచ్చారు. సర్కార్ చేసిన మంచి పనులను ఆయన చుట్టూ ఉన్న అవినీతిపరులు సక్రమంగా అమలు కానీయలేదు.

అంతేకాదు, పాతికేళ్ల పాలనలో వామపక్ష ప్రభుత్వం కూడా చాలా తప్పులు చేసింది. విద్యా, ఉద్యోగ కల్పనలో విఫలమయ్యింది. రవాణా సౌకర్యాలు కూడా పెద్దగా అభివృద్ది చేయలేకపోయారు మాణిక్ సర్కార్. అవినీతిని ఆపలేకపోయారు. కాషాయంలోకి నేతల వలసలను నిలువరించలేకపోయారు. అయితే, మాణిక్ సర్కార్ ప్రవేశపెట్టిన 30 ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశాయని, సాధారణ ప్రజలు ఇప్పటికీ భావిస్తారు. అయితే ఇవేవీ మాణిక్‌ సర్కార్‌ను ఈసారి నిలబెట్టలేకపోయాయి. బీజేపీ విజయాన్ని ఆపలేకపోయాయి.
ఆయన మంచోడే కానీ, ఫలితం ఎందుకు తారుమారైంది ? Reviewed by ADMIN on March 03, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.