సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు - కాంగ్రెస్ రాష్ట బీసీ సెల్ నాయకులు శివాచారి
The bullet news (Delhi)- కాంగ్రెస్ పార్టీ రాష్ట బీసీ సెల్ నాయకులు శివాచారి ఢిల్లీలోని కేవీపి రామచంద్రరావును కలిశారు.. జిల్లాలో విద్యుత్ కార్మికులు గత కొద్ది రోజులుగా చేస్తున్న సమ్మెను ఆయన వద్ద ప్రస్తావించారు.. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తద్వారా జిల్లాలో జరిగే అభివృద్ది గురించి ఆయన కేవీపి వద్ద ప్రస్తావించారు.. పార్లమెంట్ లో ఈ అంశాలపై ప్రస్తావించాలని ఆయన కోరారు.. దీనికి సంబందించి ఓ రిప్రజంటేషన్ కూడా ఇచ్చారు.. శివాచారి చెప్పిన ప్రతి మాటను సావదానంగా విన్న కేవిపి రామచంద్రరావు ఖచ్చితంగా ఈ సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తానన్నారు.. అనంతరం శివాచారి మాట్లాడుతూ నెల్లూరుజిల్లాలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు గత 16 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.. ఎన్నికల మేనిపెస్టోలో పొందుపరిచిన విధంగానే తమను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే దున్నపోతు మీద వర్షం పడిన చందాన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. శ్రమకు తగ్గ ఫలితాన్ని విద్యుత్ కార్మికులు అడుగుతున్నారే తప్పా చంద్రబాబు నాయుడు సంపాదించిన అక్రమాస్తులేమన్నా రాసిమన్నారా అని ఆయన ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన దుయ్యబట్టారు.. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.. తమ నేత రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా స్టేటస్ ఇస్తారని ఆయన హామీ ఇచ్చారు..
సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు - కాంగ్రెస్ రాష్ట బీసీ సెల్ నాయకులు శివాచారి
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: