ఏపీ రైతు పద్దు...
THE BULLET NEWS (AMARAVATHI)-ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 19,070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. రెండో అర్థ సంవత్సరంలో 24.5 శాతం వృద్ధి సాధించామని.. జాతీయ స్థాయి వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 14శాతం అధికంగా నమోదైందని తెలిపారు. రబీలో 42శాతం వర్షపాతం తక్కువగా నమోదైనందువల్ల వరి దిగుబడి స్వల్పంగా తగ్గినా హెక్టారుకు 5,176 కిలోల ఉత్పత్తి నమోదు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానం, వరి ఉత్పాదనలో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా ముందస్తు నీటి విడుదల వల్ల అధికోత్పత్తి సాధ్యమైందని...రబీ పంట చివరి దశ సాగునీటికి మార్గం సుగమమైందని మంత్రి పేర్కొన్నారు. విభజన తర్వాత నాగార్జున సాగర్ నుంచి రాష్ట్ర నీటి వాటా 132 టీఎంసీలు మాత్రమే వచ్చాయన్నారు. రైతులకు వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాల పంపిణీ చేస్తు్న్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విత్తనాల సరఫరాల కోసం ఆధార్ అనుసంధానం అమలు చేస్తు్న్నామన్నారు. విత్తన సరఫరాలో పారదర్శకతకు రాష్ట్రానికి జాతీయస్థాయిలో అవార్డు లభించిందన్నారు. వేరు శనగ విత్తనాలను 90శాతం రాయితీతో సరఫరా చేశామన్నారు. కర్నూలు జిల్లా తంగడంలో అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పామని.. ఇది దేశంలో మొట్టమొదటి మెగా సీడ్ పార్క్ అని తెలిపారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు అగ్రిటెక్ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఉత్తరాంధ్రలో తగ్గుతున్న ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి :
ఉత్తరాంధ్రలో తగ్గుతున్న ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గత ఏడాది కంటే వేరు శనగ ఉత్పత్తి విస్తీర్ణం 31 శాతం తగ్గిందన్నారు. కాగా వేరు శెనగ విత్తనాలను 90 శాతం రాయితీతో సరఫరా చేశామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ముందస్తు నీటి విడుదలతో అధికోత్పత్తి సాధ్యమయిందన్నారు. రైతులకు వందశాతం రాయితీలో సూక్ష్మపోషకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీని అమలు చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన సంకేతిక పరిజ్నానం అందించేందుకు అగ్రిటెక్ ను ఉపయోగిస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తన సరఫరా కోసం ఆధార్ తో అనుసంధానం చేశామన్నారు. సాయిన ఎరువుల వాడకంలో దేశంలో ఆరోస్థానంలో వున్నామన్నారు. దేశంలో మొదటిసారిగా ఈ మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాలో దేశంలోను తొలిసారిగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. నూతన పద్దతులతో కూరగాయల సాగు 35 శాతం పెంచగలిగామన్నారు. అలాగే ఉద్యానవన పంటలతో రైతుల ఆదాయం మెరుగుపడుతోందన్నారు. రాబోయే రోజుల్లో వేయికి పైగా రైతు సంఘాల ఏర్పాటు చేస్తామన్నారు.
*పశు సంవర్థక శాఖకు రూ.223 కోట్లు
*మత్స్యశాఖకు రూ.386 కోట్లు
*మెగా సీడ్ పార్క్ కు రూ.100 కోట్లు
*జైకా ప్రాజెక్ట్ కింద రూ.2000 కోట్లు
*కౌలు రైతుల రుణాలకు రూ.2,346 కోట్లు
*కరవు నివారణకు రూ.1,042కోట్లు
*అజిమ్ ప్రేమ్ జీ సంస్థతో పరిశోధనలకు రూ.100 కోట్లతో ఒప్పందం
*వ్యవసాయ అనుబంధ రంగాల ప్రోత్సాహాలకు రూ.420 కోట్లు
*వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.258 కోట్లు
*ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగానికి రూ.4730 కోట్లు
*రెవెన్యూ వ్యయం.. రూ.18,602.98కోట్లు
*పెట్టుబడి వ్యయానికి రూ.467.38కోట్లు
*రైతు రథం పథకం కింద రూ.2.50లక్షల రాయితీతో ట్రాక్టర్ల మంజూరు

Reviewed by ADMIN
on
March 08, 2018
Rating:
No comments: