మద్దతు ధర పెంచండి.. రైతాంగాన్ని ఆదుకోండి - ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి
The bullet news (Nellore)- కష్టాల్లో ఉన్న జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.. రైతులతో కలిసి ఇవాళ ఆయన జేసీ ఇంతియాజ్ అహ్మద్ ను కలిశారు.. కనీస మద్దతు ధర కల్పించి ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన జాయింట్ కలెక్టర్ ను కోరారు.. దళారులు, మిల్లర్లు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. స్వామినాధన్ కమిటి సిఫారసులను అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచించడమే మానేశారన్నారు.. కనీస మద్దతు ధర రూ.16000 పెంచి జీవోను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ముఖ్యమంత్రికి ప్యాకేజీలమీద ఉండే శ్రద్ద రైతుల గిట్టుబాటు ధర మీద లేదని మండిపడ్డారు.. రైతులకు మద్దతు దర పెంచేవరకు వైసీపీ రైతులకు అండగా ఉంటుందన్నారు.
మద్దతు ధర పెంచండి.. రైతాంగాన్ని ఆదుకోండి - ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: