రైతులను గిట్టుబాటు ధర విషయలో ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు - మంత్రి సోమిరెడ్డి
The bullet news (Nellore)- ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను తగ్గించి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖామంత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.. నెల్లూరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రైతు సంఘాల నాయకులు, రైతులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ గిట్టుబాటు ధర విషయంలో మిల్లర్లు, బ్రోకర్లు,డీలర్లు రైతులకు ఇబ్బంది కల్గిస్తే ఎవ్వరినీ ఊపేక్షించమన్నారు.. గిట్టుబాటు ధర విషయంలో మిలర్లకు సహకరించినా.. ఉదాసీనంగా వ్యవహరించినా అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నెల్లూరు ఫైన్ వెరైటీ రకాలకు క్వింటాకు రూ.250 బోనస్ అందించే విషయమై రైతులు, రైతు నాయకుల ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.. జిల్లాలో ఈ ఏడాది ఏడున్నర లక్షల ఎకరాలు సాగైందన్నారు.. 30లక్షల పుట్లు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని స్పష్టం చేశారు.. జిల్లాలో నీటిని పొదుపును వాడటం వల్లే తాగునీటి ఇబ్బందులు తలెత్తలేదని, వర్షాలు లేకున్నా శ్రీశైలం నుంచి 21 టీఎంసీల నీటిని తీసుకురాగలిగామని వివరించారు..
రైతులను గిట్టుబాటు ధర విషయలో ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు - మంత్రి సోమిరెడ్డి
Reviewed by ADMIN
on
March 04, 2018
Rating:
No comments: