Top Ad unit 728 × 90

లవ్‌లో పడ్డాను.. పాస్ చేయండి సార్

The bullet news ( Hyderabad) _ లవ్‌లో పడ్డాను.. పాస్ చేయండి సార్ అని ఓ స్టూడెంట్ తన ఆన్సర్ షీట్ లో రిక్వెస్ట్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్లు దిద్దుతున్న టీచర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ విద్యార్థి తన కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా రాశాడు. ఐ లవ్ మై పూజ అని ఆకర్షణీయంగా పెద్ద అక్షరాలతో రాశాడు. ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఈ ప్రేమ బతుకనీయదు.. చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు చదవలేకపోయాను. మీరే నన్ను పాస్ చేయండి అంటూ ఆ విద్యార్థి వేడుకున్నాడు. ఐ లవ్ మై పూజ పక్కన హార్ట్ సింబల్ గీశాడు.ఇక మరో విద్యార్థి అయితే ఈ విధంగా రాశాడు. నాకు అమ్మ లేదు. నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నాన్న నన్ను చంపేస్తారు అని రాశాడు. ఇంకో విద్యార్థి టీచర్లను హెచ్చరించాడు. మీరు నన్ను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు. ఈ ఘటనలపై ముజఫర్‌నగర్ జిల్లా విద్యాధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థులైతే తమను పాస్ చేయాలని కోరుతూ పరీక్ష పేపర్ల మధ్య కరెన్సీ నోట్లు పెడుతున్నారని తెలిపారు.
లవ్‌లో పడ్డాను.. పాస్ చేయండి సార్ Reviewed by ADMIN on April 07, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.