అవ్వతాతలు,అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు - ఎమ్మెల్యే కాకాణి
The bullet news (Manubolu)_ ప్రతి అక్క చెల్లెల్లు, అవ్వతాతలు, అన్నదమ్ములు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు.. నెల్లూరుజిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లిలో వై.యస్.ఆర్.కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు, నాయకులు ఆయనికి ఘన స్వాగతం పలికారు.. ఇంటింటికి వెళ్లిన కాకాణి నవరత్నాల గురించి వివరించారు.. వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై రైతులు, మహిళలు, యువత ఆగ్రహంతో ఉన్నారన్నారు.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.. నిరుద్యోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులును నిలువెల్లా మోసం చేశారన్నారు.. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు..
అవ్వతాతలు,అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు - ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
October 02, 2017
Rating:
No comments: