మహాత్మాగాంధీ ఆశయాలు ఆదర్శనీయం - సింహపురి యూత్ అసోసియేషన్
the bullet news (Venkata Giri)_బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాంధీ ఒక్క భారతావనికే కాదు ఎన్నో ప్రపంచ దేశాలకు స్ఫూర్తి ప్రదాతని సింహపురి యుత్ అసోసియేషన్ సభ్యులు పి ప్రవీణ్ కుమార్ అన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆలోచనలు, సిద్దాంతాలు, ఆశయాలు అందరూ ఆచరించాలన్నారు.. ముఖ్యంగా యువత అహింసా మార్గాన్ని అనుసరించాలన్నారు.. అహింసా పద్దతిలోనే బ్రిటిష్ వారిని మహాత్మాగాంధీ తరిమేశారన్నారు.. ఈ కార్యక్రమంలో సభ్యులు వెంకటేశ్, మధు, మోహన్, ధీక్షత్ కుమార్, ధరణీ , సంద్య కిరణ్ పాల్గొన్నారు..
మహాత్మాగాంధీ ఆశయాలు ఆదర్శనీయం - సింహపురి యూత్ అసోసియేషన్
Reviewed by ADMIN
on
October 02, 2017
Rating:
No comments: