హత విధీ.. సరస్వతి నిధి?
The bullet news(nellore)- పేద విద్యార్థుల కార్పొరేట్ చదువులకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ‘సరస్వతి’ నిధికి నిర్లక్ష్యం గ్రహణం పట్టుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభంలో సవ్యంగా సాగినా..సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో పిల్లల చదువులకు విఘాతం కలుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో అత్యధిక పాయింట్లు (జీపీఏ) సాధించిన పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారిని కార్పొరేట్ కళాశాలల్లో చదివించేందుకు 2011 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ శ్రీధర్ చొరవతో దీనికి రూపకల్పన చేశారు. దాతల సహకారంతో సేకరించిన విరాళాలతో ప్రత్యేకంగా ఈ ‘సరస్వతి’ నిధిని ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు చెందిన పేద విద్యార్థులను ఎంపికచేసి కార్పొరేట్ కళాశాలలకు వారిని కేటాయించి అక్కడే వసతి గృహంలో ఉంచి జూనియర్, సీనియర్ ఇంటర్మీడియట్ విద్యలో వారు ఎంచుకున్న కోర్సుల్లో చదువుకునేలా ప్రత్యేక చొరవ చూపారు. ఈ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు గత రెండేళ్లగా కలెక్టరేట్ అధికారులు ఫీజులు చెల్లించడం లేదు. దీంతో సంబంధిత కళాశాలల యాజమాన్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెస్తున్నారు.దాదాపుగా రూ.1.44కోట్లుకు పెగా చెల్లించాల్సి ఉందని సంబంధిత యాజమాన్యం పేర్కొంటోంది. 2011లో జిల్లాలో ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకం కింద దాతల సహాయంతో దాదాపు రూ.5 కోట్లకు పైగా నిధిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 2012-14 విద్యా సంవత్సరానికి 40 మందిని, 2013-15 విద్యా సంవత్సరం 50 మంది, 2014-16 విద్యా సంవత్సరానికి 32 మంది, 2015-17 సంవత్సరానికి 42 మందిని, 2016-18 విద్యా సంవత్సరానికి 24 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మొదటిలో ఎక్కవ మంది పేద విద్యార్థులను ఎంపిక చేసిన కలెక్టరేట్ ఉన్నతాధికారులు క్రమేపి దీని సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. తరువాత గత ఏడాది అసలు ‘సరస్వతి’ నిధి కింద మెరిట్ విద్యార్థుల ఎంపికలే చేపట్టలేదు.2016 విద్యా సంవత్సరానికి 24 మందిని ఎంపిక చేసినప్పటికీ వీరికి ఇక్పటికీ సవ్యంగా ఫీజులు చెల్లించలేదని ఆయా కళాశాలల యాజమాన్యం చెబుతోంది. ఈ ఏడాదికి తల్లిదండ్రులే ఫీజులు చెల్లించాలని లేని పక్షంలో హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. ఒక వేళ కోర్సులు పూర్తి అయినప్పుటికీ టీసీలు ఇవ్వమని కచ్చితంగా ఫీజలు చెల్లించి టీసీలు తీసుకుపోవాలంటూ స్పష్టం చేస్తున్నారు. - జిల్లా సంయుక్త పాలనాధికారి ఇంతియాజ్
సరస్వతి నిధి ద్వారా పేద విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో చదివిచే విధానం కొనసాగుతోంది.ఈ ఏడాదికి సంబంధించిన ఫీజులను చెల్లించాల్సి ఉంది.ఈ విషయమై జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకువెళుతున్నాము. పూర్తిగా పరిశీలించి చర్యలు చేపడతాము.
సరస్వతి నిధి ద్వారా పేద విద్యార్థులను కార్పొరేట్ కళాశాలల్లో చదివిచే విధానం కొనసాగుతోంది.ఈ ఏడాదికి సంబంధించిన ఫీజులను చెల్లించాల్సి ఉంది.ఈ విషయమై జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకువెళుతున్నాము. పూర్తిగా పరిశీలించి చర్యలు చేపడతాము.
హత విధీ.. సరస్వతి నిధి?
Reviewed by ADMIN
on
February 28, 2018
Rating:
No comments: