Top Ad unit 728 × 90

అగ్నిమాపక శాఖలో రోబొటిక్‌ వ్యవస్థ

The bullet news(nellore)-  అగ్నిమాపక శాఖలో త్వరలో రోబొటిక్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుందని డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ జయరామ నాయక్‌ అన్నారు. అత్యంత అధునాతన పరికరాలతో విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన నెల్లూరుకు వచ్చిన సందర్భంగా ఆశాఖ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఆశాఖ ఆధ్వర్యంలో అందుబాటులోని పరికరాలు, వస్తువులను పరిశీలించారు. తొలుత జిల్లా అధికారులకు డెమో నిర్వహించారు. మంటలు ఎలా అదుపులోకి తీసుకోవాలి, భవనాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భవనాల నుంచి కింద రావడం ఎలా, క్షతగాత్రులను ఎలా కాపాడాలి, ప్రమాదాల్లో వాహనాలను ఏ విధంగా బయటకు తీయాలి, తదితర అంశాలపై సిబ్బంది చేసి చూపించారు. వీధులు, ఇరుకు సందుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ద్విచక్ర వాహనం ద్వారా మంటలను ఎలా ఆర్పాలో చేసి చూపించారు. సిబ్బంది చూపించిన డెమో ఆకట్టుకుంది. ఏఏ పరికరాలు దేనికి ఉపయోగించాలి, ఏ సమయంలో ఉపయోగించాలనే విషయాలపై సిబ్బంది వివరించారు. అనంతరం వాహనాలను అగ్నిమాపక శకటం ద్వారా లాగే ప్రయత్నం చేయగా అది విఫలమైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా తమశాఖలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. మల్టీపర్పస్‌ వాహనాలు ప్రతి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది తీర ప్రాంత జిల్లాల్లో తుపానులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందికి శిక్షణలు అందిస్తున్నట్లు, వీరందరూ ఒడిశా, పశ్చిమ బెంగ, చెన్నై, బెంగళూరు, ముంబయి, గోవా లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అధునాతన పరికరాలు లైఫ్‌ బోర్డు, రోప్‌, కట్టర్‌, విక్టిమ్‌ లోకేషన్‌, తదితర పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీలైనంత వరకు మానవ రహిత సేవలకు త్వరలో రోబొటిక్‌ వ్యవస్థ రానుందన్నారు. దాంతో భారీ మంటలు వ్యాపించినప్పుడు వీరి సేవలను వినియోగించుకునేలా జరుగుతుందన్నారు.                                                                                               రష్యాలో జరిగిన అగ్ని ప్రమాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తమ శాఖ అప్రమత్తమైందని జయరామ నాయక్‌ పేర్కొన్నారు. షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో అగ్నిమాపక శాఖ పరికరాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలా చేయని వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. జిల్లాలో జరిగిన బాణసంచా ప్రమాదాలు పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా అగ్నిమాపక శాఖాధికారి ధర్మారావు, ఎస్‌ఎఫ్‌వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక శాఖలో రోబొటిక్‌ వ్యవస్థ Reviewed by ADMIN on March 29, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.