Top Ad unit 728 × 90

సభ్యుల వీడ్కోలు సభలో నవ్వులు విరబూశాయి...

THE BULLET NEWS (NEW DELHI)-మరికొద్ది రోజుల్లో తన రాజ్యసభ పదవీకాలాన్ని ముగించుకోనున్న కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడి మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. పదవీ విరమణ చేస్తున్న ఎంపీలకు వీడ్కోలు పలుకుతున్న వేళ, ప్రసంగించిన రేప్రసంగించిన రేణుక "ఆయన అంటే వెంకయ్య నన్ను ఎన్నో కిలోలుగా అంటే సంవత్సరాలుగా అన్న మాటకు బదులు రేణుక 'కిలో' పదాన్ని వాడారన్నమాట వాడారు. సార్, నా బరువు గురించి చాలా మంది బాధపడుతున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ ఉద్యోగంలో బరువు బాధ్యతలను సక్రమంగా నెరవేర్చండి" అన్నారు.వెంటనే రేణుకా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన వెంకయ్య, "నేనిచ్చే సింపుల్ సలహా ఏంటంటే, మీ బరువును తగ్గించుకోండి. పార్టీ బరువును అంటే ప్రతిష్టను పెంచే ప్రయత్నాలు చేయండి" అన్నారు. ఆయన మాటలకు ఏ మాత్రం తగ్గని రేణుక "సార్... కాంగ్రెస్ చాలా బాగుంది. ఎవరూ ఏమీ చేయలేరు" అన్నారు. దీంతో సభలోని మిగతావారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక సభ్యుల వీడ్కోలు ప్రసంగాల్లో పలుమార్లు నవ్వులు విరబూశాయి.
సభ్యుల వీడ్కోలు సభలో నవ్వులు విరబూశాయి... Reviewed by ADMIN on March 29, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.