చంద్రబాబు నాయుడు వింత వ్యాధితో బాధపడుతున్నారు.. - మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న
The bullet news (Nellore)_ చంద్రబాబు నాయుడి 40 ఏళ్ల రాజకీయ జీవితం అబద్దాలు,మోసాలు, వెన్నుపోటులేనంటూ మాజీ మంత్రి, వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడ్ని పొగుడుతున్న ఆ రెండు తోక పత్రికలు ఆయన చేసిన అవినీతిని, అక్రమాలను, వెన్నుపోటులను కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.. వైసీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వింత వ్యాధితో బాధపడుతున్నారని, గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని చంద్రబాబు నుంచి రాష్ట ప్రజలను కాపాడాలన్నారు.. వైఎస్సార్ కి టిక్కెట్ తానే ఇప్పించానని, ఎన్టీయార్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెబుతున్న చంద్రబాబు నాయుడ్ని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదమన్నారు.. జగన్ నాయకత్వంలో కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా తీసుకొస్తామని ప్రసన్న స్పష్టం చేశారు..
చంద్రబాబు నాయుడు వింత వ్యాధితో బాధపడుతున్నారు.. - మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న
Reviewed by ADMIN
on
March 01, 2018
Rating:
No comments: