Top Ad unit 728 × 90

కార్ @ రూ.75వేలు...

THE BULLET NEWS (BOBILI)-ఓ పాతకారు ఇంజిన్‌తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేవలం రూ. 75 వేలతో అద్భుతమై కారును రూపొందించారు ఇంజినీరింగ్‌ విద్యార్థులు. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం కోమటపల్లిలోని తాండ్రపాపారాయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఈ కారును తయారు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బి.వెంకటరమణ ఆధ్వర్యంలో మెకానికల్‌ హెడ్‌ కృపారావు, వర్క్‌షాపు ఇన్‌చార్జి నర్సింగరావుల పర్యవేక్షణలో జీఎల్‌ కార్తీక్, వి.సురేష్, ఎన్‌ఎస్‌ శ్రీకాంత్, వి.మణికంఠ, బి.హరీష్‌బాబు, వెంకటరమణ తదితరులు ఈ మల్టీ పర్పస్‌ కారును రూపొందించారు.

ఈ మల్టీపర్పస్‌కారును బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌ విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి అద్భుతాలైనా సాధించగలరన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.

కార్ ఫీచర్స్..

*కారుకు ఖర్చు కేవలం రూ. 75 వేలు.

*మైలేజీ 50-60 కిలో మీటర్ల వేగంతో 20-23 కి.మీ. నడుస్తుంది.

* డ్రైవర్‌తో కలిపి ఆరుగురు ప్రయాణించవచ్చు.

* అల్ట్రాసోనిక్‌ సెన్సార్ల సహాయంతో నడిచే ఈ కారు ఎదురుగా మీటరు దూరంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించే వీలుంది.

*మద్యం సేవించి వాహనం నడిపితే కారు కదలదు. ఓనర్‌కు మెసేజ్‌ వెళ్లి వాహనం నిలిచిపోతుంది.

*వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.
కార్ @ రూ.75వేలు... Reviewed by ADMIN on April 01, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.