Top Ad unit 728 × 90

బురిడీ బాబా కేసులో ఫస్ట్ వికెట్ డౌన్.. పోలీసుల అదుపులో నాగ వాసవి.

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరుజిల్లాలో సంచలనం కల్గించిన బురిడీ బాబా కేసులో పోలీసులు పురోగతి సాధించారు.. ఆద్యాత్మికం ముసుగులో భక్తులకు కోట్ల రూపాయాలు కుచ్చుటోపి పెట్టి పరారైన వాసవిని అదుపులోకి తీసుకున్నారు.. నిందితురాలు వాసవి నుంచి ఓ ల్యాప్ లాప్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.. మీడియాతో మాట్లాడిన పోలీసులు ఓ ప్రయివేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సుధాకర్ బాబాను చూసేందుకు వచ్చిన సమయంలో వాసవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆమె నుంచి కీలక సమాచారం సేకరించామని త్వరలోనే కేసుకు సంబంధం ఉన్న నిందితులను పట్టుకుంటామని నెల్లూరు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి మీడియాకు తెలిపారు.. మరొో పక్క వాసవిని అరెస్టు చేసిన విధానం పలు అనుమానాలకు తావిస్తోంది.. హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సుధాకర్ బాబాపై పోలీసుల నిఘా ఉందని తెలిసి కూడా వాసవి ఎందుకు హాస్సటల్ కు వచ్చింది..? హాస్పటల్ వద్ద అరెస్టు చేశారా..? ఇంకెక్కడానైనా అరెస్టు చేసి కేసును తప్పదో్వ పట్టించేందుకు పోలీసులు యత్నిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. పురుగుల మందు తాగిన సుధాకర్ బాబా గత నెలరోజులుగా హాస్పటల్ లోనే చికిత్స పొందుతున్నారు.
బురిడీ బాబా కేసులో ఫస్ట్ వికెట్ డౌన్.. పోలీసుల అదుపులో నాగ వాసవి. Reviewed by ADMIN on March 31, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.