నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
The bullet news (Education)_ ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. రాజమండ్రిలోని షల్టన్ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేస్తారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఈ ఫలితాలను బుల్లి తెరపైనా(టీవీ) చూసే అవకాశం కల్పించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఈ ఫలితాలను నేరుగా ప్రసారం చేయనుంది.
టీవీ తెరపై ఇంటర్ ఫలితాలకు సంబంధించిన సూచీ కనిపిస్తుంది. దీనిపై రిమోట్‌తో ప్రెస్ చేసి, హాల్ టికెట్ నెంబర్‌ను టైపు చేస్తే విద్యార్థికి సంబంధించిన ఫలితాలు టీవీ తెరపై కనిపిస్తాయి. దీంతోపాటు పీపుల్స్ ఫస్ట్ సిటిజన్ మొబైల్ యాప్, ఏపీ సీఎం కనెక్ట్ ఖైజాలా యాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. కాగా, శుక్రవారం విశాఖలో ఫస్టియర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10,26,891 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.
ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు
www.andhrajyothy.com, http://examresu-lts.ap.nic.in, www.vidyavision.com, http://-results.cgg.gov.in, https://results.apcfss.in
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
Reviewed by ADMIN
on
April 12, 2018
Rating:
No comments: