పార్కిన్ సన్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం - డా.దీక్షాన్తీ నారాయణ్
The bullet news ( Nellore)_ పార్కిన్ సన్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.దీక్షాన్తీ నారాయణ్ పిలుపునిచ్చారు. వరల్డ్ పార్కిన్ సన్స్ డే సందర్భంగా సింహపురి హాస్పిటల్స్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెదడుకు సంబంధించిన వ్యాధులలో పక్షవాతం, మూర్ఛ, మతిమరుపు మొదలగు వ్యాధుల గురించి తెలిసి ఉండవచ్చు కానీ, పార్కిన్ సన్స్ వ్యాధి గురించి ఎంతోమందికి అవగాహన లేదన్నారు. దీని లక్షణాలు ముఖ్యంగా చేతులలో వణుకుడుతో మొదలవుతుందని, తర్వాత కాళ్లకు కూడా వస్తుందన్నారు. చాలామంది ఈ లక్షణాలను తేలికగా తీసివేస్తారని, కానీ అది పనికిరాదన్నారు. అదే తర్వాత తీవ్రరూపం దాల్చి కాళ్ళు, చేతులు పట్టివేస్తాయన్నారు. పార్కిన్మ సన్స్ వ్యాధిగ్రస్తుడు దైనందిన కార్యక్రమాలైన నడవడం, మాట్లాడడం, తినడం, వ్రాయడం వంటివి చాలా నెమ్మదిగా సాగుతాయన్నారు. చిన్న చిన్న అడుగులు వేయడం, ముందుకు వంగి నడవడం, మాటలో స్పష్టత లేకపోవడం, గొణిగినట్లు మాట్లాడడం, నిలబడడంలో సంతులనం కోల్పోవడం , చేతి వ్రాతలో మార్పు రావడం, వేగంగా వ్రాయలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఎక్కువ నిద్ర పోవడం వంటివి పార్కిన్ సన్స్ వ్యాధి లక్షణాలేనన్నారు. దీనికి కారణాలు కొన్ని జన్యుపరంగా వస్తాయి, కొన్ని తలకు ఎక్కువసార్లు గాయం అవడం వల్ల, ఆహార పదార్ధాల్లో పెస్టిసైడ్స్ వాడకం వల్ల వస్తాయన్నారు. పక్షవాతం మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయన్నారు. మందులతో ఈ వ్యాధిని చాలా వరకు నయం చేయవచ్చు. వ్యాధి ముదిరినప్పుడు సర్జరీ కూడా అవసరపడవచ్చన్నారు. ఈ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకున్నట్లైతే వారు కూడా సాధారణ జీవితం జీవించవచ్చన్నారు.
సింహపురి హాస్పిటల్స్ చైర్మన్ కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ పార్కిన్ సన్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని లక్షణాలు కనిపించినప్పుడు తగిన వైద్యుని సంప్రదించి చికిత్స పొందడం చాలా అవసరమన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించేందుకు సింహపురి ఇన్ స్టిట్యూట్ అఫ్ న్యూరో సైన్సెస్ ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషదాయకమన్నారు.
న్యూరో సర్జన్ డా.వెంకటేశ్వర ప్రసన్న మాట్లాడుతూ ముఖంలో కోపం, బాధ, భయం, జాలి వంటి భావాలను వ్యక్తీకరించలేకపోవడం, వణుకుడు, నెమ్మదిగా నడవడం వంటి లక్షణాలు కనిపించినట్లైతే వెంటనే న్యూరాలజిస్టును కలిసినట్లైతే మందులతోనే నయం చేయడం సాధ్యమన్నారు. అప్పుడు వ్యాధిగ్రస్తుడు సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పార్కిన్ సన్స్ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు చైర్మన్ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, డా.దీక్షాన్తి నారాయణ్, డా.వెంకటేశ్వర ప్రసన్న, డా.సాగర్, డా.హిమ బిందు లు సింహపురి హాస్పిటల్స్ ప్రాంగణంలో అతి పెద్ద హైడ్రోజన్ బెలూన్ ను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవి కుమార్, మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Reviewed by ADMIN
on
April 11, 2018
Rating:
No comments: