అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు కలసికట్టుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సిరియాపై దాడులు...
THE BULLET NEWS -కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో తగలబడుతున్న సిరియాలో మరోసారి యుద్ధ వాతావరణం ఏర్పడింది. రసాయన దాడుల్లో వందల మంది పౌరులు ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశంతో ఇప్పుడు సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ కు వ్యతిరేకంగా అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు కలసికట్టుగా శుక్రవారం(ఏప్రిల్-13) అర్ధరాత్రి నుంచి సిరియాపై దాడులు చేస్తున్నాయి. రాజధాని డమాస్కస్ తూర్పు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని, పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంలో ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయింది.
సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ రసాయన దాడులకు పాల్పడటంతోనే.. మరోసారి రసాయన దాడులు జరగకుండా ఆపేందుకు సిరియాపై వైమానిక దాడులు చేస్తున్నామని ట్రంప్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలు వాడుతూ సొంత ప్రజల ప్రాణాలు తీస్తున్న అసద్ పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమైందని ట్రంప్ తెలిపారు. సిరియాకు సహాయం చేస్తున్న ఇరాన్, రష్యాలను కూడా ట్రంప్ హెచ్చరించారు.
అసద్ ఆయుధ కర్మాగారాలు, దాచి ఉంచిన క్షిపణుల లక్ష్యంగా.. తమ దాడులు విజయవంతమైనట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. సిరియా మాత్రం నిషేధిత ఆయుధాలను వాడలేదని తెలిపింది. ఈ ఏడాదిలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి.
సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ రసాయన దాడులకు పాల్పడటంతోనే.. మరోసారి రసాయన దాడులు జరగకుండా ఆపేందుకు సిరియాపై వైమానిక దాడులు చేస్తున్నామని ట్రంప్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలు వాడుతూ సొంత ప్రజల ప్రాణాలు తీస్తున్న అసద్ పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమైందని ట్రంప్ తెలిపారు. సిరియాకు సహాయం చేస్తున్న ఇరాన్, రష్యాలను కూడా ట్రంప్ హెచ్చరించారు.
అసద్ ఆయుధ కర్మాగారాలు, దాచి ఉంచిన క్షిపణుల లక్ష్యంగా.. తమ దాడులు విజయవంతమైనట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. సిరియా మాత్రం నిషేధిత ఆయుధాలను వాడలేదని తెలిపింది. ఈ ఏడాదిలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి.
అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు కలసికట్టుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి సిరియాపై దాడులు...
Reviewed by ADMIN
on
April 14, 2018
Rating:
No comments: