రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను.. - మంత్రి సోమిరెడ్డి.
THE BULLET NEWS-అధికారులు, మిల్లర్లు ... ఎవరైనా సరే... రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.. ఇవాళ నెల్లూరు లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా ఉన్నతాధికారులు, రైతు సంఘాల నేతలతో సమీక్ష నిర్వహించారు.. అధికారులకు పలు సూచనలు చేశారు.. మీడియాతో మాట్లాడిన ఆయన రైసుమిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు.. నెమ్ము, తరుగు పేరుతో రైతులను బ్లాక్ మెయిల్ చేసే రైసు మిల్లర్లపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్నారు.. శ్రీశైలం నుంచి 22 టీఎంసీల నీటిని తెప్పించి జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండకుండా నిరిచ్చిన ఘనత తమదేనన్నారు... జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీపీటీ ధాన్యం క్వింటాల్ కి రూ.210 బోనస్ ప్రకటించామని వెల్లడించారు. ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలన్నారు.ఇప్పుడు మాటలు చెబుతున్న వారు గతంలో తమ ప్రభుత్వాల హయాంలో గోళ్లు గిల్లుకుంటూ రైతులను గాలికి వదిలేయడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.. తమ ప్రభుత్వం పై నోరు పారేసుకుంటే ఫలితం లేదన్నారు..మొక్కజొన్న రైతులు పంటను ఎక్కడ అమ్ముకున్నా క్వింటాలుకు రూ.200 చొప్పున గరిష్టంగా 100 క్వింటాళ్లకు రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు..
రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను.. - మంత్రి సోమిరెడ్డి.
Reviewed by ADMIN
on
April 13, 2018
Rating:
No comments: