ఉద్యోగాల కోసం ఉద్యమిద్దాం - డివైఎఫ్ ఐ ఆలిండియా ఉపాధ్యక్షురాలు దీపా
The bullet news (Nellore)_ నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వారికి వెంటనే ఉపాది అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రచించాలని డివైఎప్ఐ ఆలిండియా ఉపాద్యక్షురాలు దీపా డిమాండ్ చేశారు. డివైఎప్ఐ 14వ రాష్ట మహాసభలు నెల్లూరులో జరుగుతున్న నేపథ్యంలో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు.. యువజన విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.. పరిశ్రమలను స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామని దేశ వ్యాప్తంగా ఉన్న భూములను లాక్కొన్న ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు.. సమాజంలో అసమానతలు, నిరుద్యోగం, అజ్ణానం పాలదోలేందుకు, నియంత్రతృత్వ పోకడలను రూపుమాపేందుకు డివైఎప్ ఐ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.. అన్ని యూనివర్శిటీల్లో ఎన్నికలు నిర్వహించి యువకులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రోత్సహించాలని ఆమె కోరారు..
ఉద్యోగాల కోసం ఉద్యమిద్దాం - డివైఎఫ్ ఐ ఆలిండియా ఉపాధ్యక్షురాలు దీపా
Reviewed by ADMIN
on
September 25, 2017
Rating:
No comments: