సంకల్పం ముందు చిన్నబోయింది..
The bullet news (Venkata Giri)- సంకల్పానికి ఏది అడ్డురాదని మరో సారి నిరూపించారు వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా బాలకృష్ణ. అనారోగ్య కారణాలతో బంగారు పేట ఒకటో వార్డుకి చెందిన మేకల సుబ్బమ్మ ఇవాళ ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మునిసిపల్ ఛైర్పర్సన్ దొంతు శారదబాలకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం రూ.3000 ఆర్దిక సాయం అందజేశారు.. చైర్ పర్సన్ మాట్లాడుతూ కష్టాల్లో ఎవ్వరూ ఉన్నా ఆదుకోవడం తన బాధ్యత అన్నారు.. చనిపోయిన వారిని తీసుకురాలేకపోయినా వారికి అండగా నిలబడేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటాను అన్నారు.. మరోపక్క జోరువానలో సైతం తన సంకల్పాన్ని మరిచిపోకపోవడం ఆమె గొప్ప మనస్సుకు అద్దం పడుతోందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంగరావు , దొంతు గోపీ, రంగినేని భవాని శంకర్, సాయి తేజ, సతుల గిరి ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు..
సంకల్పం ముందు చిన్నబోయింది..
Reviewed by ADMIN
on
September 25, 2017
Rating:
No comments: