Top Ad unit 728 × 90

వెంక‌ట‌గిరిని అన్ని విధాల అభివృద్ది చేస్తా- ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ‌

The bullet news ( Venkata giri)- "నాకు రెండో ద‌ఫా కూడా అవ‌కాశ‌మిచ్చారు..మీ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా... వెంక‌ట‌గిరిని అన్నిరంగాల్లో శ‌క్తివంచ‌న అభివృద్ధికి కృషి చేస్తాను" అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ అన్నారు.. మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ దొంతు శార‌దా అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన మున్సిపల్ కౌన్సిల్ స‌మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. ఏ క‌ష్ట‌మొచ్చినా వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ప్ర‌తి కుటుంబానికి పెద్ద బిడ్డ‌లా ఉంటాన‌న్నారు.. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వెంకటగిరికి కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయన్నారు.. మ‌రిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాన‌న్నారు.. దాదాపు 30 ఎకరాలల్లో హెచ్ ఎఫ్ ఎల్ ను నందనవనంగా తీర్చిదిద్దుతాన‌న్నారు.. అలాగే రూ. 2కోట్లతో స్టేడియం నిర్మాణం, రూ. కోటితో రాజా వీధిలో సైడ్ కాలువ‌లు, సైడ్ లైటింగ్స్ నిర్మాణం త‌దిత‌ర ప‌నులు చేప‌డుతున్నామ‌న్నారు. 2018 మార్చి నాటికి వెంకటగిరి రూపురేఖలు మారుస్తాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్, కౌన్సిల‌ర్లు పాల్గొన్నారు..
వెంక‌ట‌గిరిని అన్ని విధాల అభివృద్ది చేస్తా- ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ‌ Reviewed by ADMIN on September 29, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.