మీ ఆప్యాయత, ఆదరణలే..మాకు ఆశీస్సులు - టీడీపీ నాయకులు దొంతు బాలకృష్ణ
The bullet news (Venkata Giri)_ యువత కేరింతలు.. అభిమానుల కోలాహాలం.పెద్దల ఆశీర్వాదాల నడుమ వెంకటగిరి పట్టణ పద్మశాలి సేవా సంఘం సెక్రటరీ, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు దొంతు బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి..ఆయన ఆయుఆరోగ్యాలతో వర్దిల్లాలని దొంతు గోపి నేతృత్యంలో అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు గ్రామ దేవత పోలేరమ్మకు బాలకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృద్దులు, వికలాంగులు, అభిమానులు, యువకులు, టీడీపీ నాయకుల సమక్షంలో ఆయన భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్దులు, వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తనని తోడు, నీడగా ఉన్న తన భార్య దొంతు శారదకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.. అనంతరం మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా మాట్లాడుతూ రాజకీయాల్లో నిరంతరం తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న తన భర్త దొంతు బాలకృష్ణ ఆయుఆరోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అందరి సమక్షంలో బాలకృష్ణ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నారు.. తాను ఈ స్థాయికి చేరడానికి, ప్రజలకు సేవలందించేందుకు తన భర్త బాలకృష్ణనే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో దొంతు గోపి , డీబీకే యూత్, హెల్పింగ్ హాండ్స్ యూత్, టెన్ స్టార్ కింగ్స్ యూత్, అభిమానులు పాల్గొన్నారు
మీ ఆప్యాయత, ఆదరణలే..మాకు ఆశీస్సులు - టీడీపీ నాయకులు దొంతు బాలకృష్ణ
Reviewed by ADMIN
on
September 23, 2017
Rating:
No comments: