మీ ఆశీస్సుల కోసం మీ ఇంటికొస్తున్నా - రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
The bullet news (Nellore)- హంగుల్లేవు..అర్బాటాల్లేవు.. జనసమీకరణ అంతకన్నా లేదు.. ప్రతి గడపను పలకరిస్తా.. మీ ఇంటి బిడ్డగా మీ ముందుకొస్తున్నా. ఆదరించండి.. ఆశీర్వదించండి.. అంటూ వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ప్రజలను విజ్ణప్తి చేశారు.. దాదాపు 105 రోజులపాటు రూరల్ నియోజకవర్గంలో విసృతంగా పర్యటించేందుకు మన ఎమ్మెల్యే- మన ఇంటికి పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. రూరల్ ప్రాంతంలోని ఈశాన్య ప్రాంతమైన కోడూరుపాడు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 105 రోజులపాటు ఇంటికి దూరంగా ప్రజల మధ్య గడుపుతానన్నారు.. వారి సూచనలు, సలహాలు స్వీకరించి రాత్రి సమయాల్లో వారి మధ్యే బస చేస్తానన్నారు.. సెలవులకు తల్లిదండ్రుల వద్దకు బిడ్డ వస్తే ఆ సమయంలో కలిగే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తానన్నారు.. వైసీపీని బలోపేతం చేస్తూనే ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాన్నారు.. ఈ సమయంలో తనతోపాటు ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఉంటారన్నారు..
మీ ఆశీస్సుల కోసం మీ ఇంటికొస్తున్నా - రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Reviewed by ADMIN
on
September 23, 2017
Rating:
No comments: