వైస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర @100 రోజులు
THE BULLET NEWS-వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 100వ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
బుధవారం ఉదయం ఉప్పలపాడు శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్లురు క్రాస్ మీదుగా మర్రిచెట్టపాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. ఆయన అక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బుదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. ఆయన రాత్రి ఇక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 1340 కిలోమీటర్లు నడిచారు.
‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవాలి. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం దక్కేలా చూడాలి. ప్రతి పేద బిడ్డా గొప్పగా చదవి పెద్దవాడిగా ఎదగాలి. రైతన్నకు వ్యవసాయం పండుగ కావాలి. బడుగు బలహీన వర్గాల్లో బరోసా కల్పించాలి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోవాలి. ఇదే నా కసి’ అంటూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. గతేడాది నవంబర్ 6న ప్రారంభమైన జననేత సుదీర్ఘయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది.
‘‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు. ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నాకున్నది ఒక్కటే కసి... నేను చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి. ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచాలన్నదే నా కసి. ఆ కసి నాలో ఉంది కాబట్టి ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను’’ తొలి రోజు పాదయత్రలో వైఎస్ జగన్
‘నేను వేసే ప్రతి అడుగులో మీ అప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైఎస్సార్‌పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశ్వీరాదాలు.. నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాయి.’’ - వెయ్యి కి.మీ పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్

Reviewed by ADMIN
on
February 28, 2018
Rating:
No comments: