శ్రీ దేవి డెత్ మిస్టరీ...
THE BULLET NEWS (DUBAI)-అందాల నటి శ్రీదేవి మరణం సహజ మరణమేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. భర్త బోనీకపూర్ సోదరి కుమారుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బాత్రూంలో శనివారం రాత్రి 11గంటలకు కుప్పకూలిపోయారని సమాచారం. ఆమె గుండెపోటుతోనే మృతి చెందారని, మృతిలో ఎలాంటి కుట్రలు లేవని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను శ్రీదేవి కుటుంబసభ్యులకు అందచేశారు. శ్రీదేవి హఠాన్మరణం నేపథ్యంలో దుబాయి ప్రతిక ప్రచురించిన కథనాలతో ఉత్కంఠ ఏర్పడింది. నివేదికలో వైద్యులు పేర్కొన్న అంశాలతో అనుమానాలు పటాపంచలయ్యాయి.
శ్రీ దేవి డెత్ మిస్టరీ...
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: