ఆ నేల మాకొద్దు బాబోయ్!
The bullet news(nature)- అనగనగా ఓ ప్రాంతం... ఎవరికీ అంతగా తెలియనిది... ప్రపంచంలోనే వింతైనది... ఎందుకో? ఏమిటో? తెలుసుకోకపోతే ఎలా?
మన హైదరాబాద్ ఏ దేశంలో ఉంది? ‘అది కూడా తెలియదా? భారతదేశంలో’ అనేస్తారు ఒక్క క్షణం ఆగకుండా. టోక్యో ఎక్కడుంది? అని అడగ్గానే కాస్త ఆలోచించైనా జపాన్‌లో ఉంది అని చెబుతారు. కాలిఫోర్నియా ఏ దేశానికి చెందిన ప్రాంతం? అంటే గూగుల్‌లో వెతికైనా ఆ... యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే కదా అంటారు. ఇలా ఏ ప్రాంతానికైనా ఏదో ఒక దేశం పేరు ఉంటుంది. కానీ ఓ చోటు మాత్రం దేనికీ చెందదు. ఒంటరిగా ప్రపంచంలో దేనికీ చెందని ప్రాంతంగా ఏకాకిగా మిగిలిపోయింది. అదే... బీర్ తవీల్ ట్రయాంగిల్.
* ఉత్తర ఆఫ్రికాలోని సుడాన్, ఈజిప్ట్ దేశాల మధ్యలో 2,060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందిది. సరిహద్దు స్థలాల కోసం యుద్ధాలు జరిగినట్టు వినుంటారు కానీ దీని పక్కనున్న సుడాన్, ఈజిప్ట్ దేశాలు మాత్రం ‘మాకొద్దు మాకొద్దు’ అంటూ దీన్ని వదిలేశారు. ఈ స్థలం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఉపయోగమూ కొంచెమైనా లేకపోవడం వల్లనే ఏ దేశమూ దీన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అంతేకాదు... ఇప్పటికీ ఈజిప్షియన్ దేశ పటంలో బీర్ తవీల్ సుడాన్‌కు చెందినదిగా, సుడాన్ దేశ పటంలో బీర్ తవీల్ ఈజిప్ట్ దేశానికి చెందినదిగా ఉంటుంది * ఎప్పుడో 1899లో ఈ రెండు దేశాల మధ్య మొదలైన ఈ వింత పరిస్థితి కొనసాగుతూనే ఉందట. దీంతో అధికారికంగానే ఏ ప్రాంతానికి చెందనిదిగా నిలిచిపోయిందిది.
* బీర్ తవీల్ అంతా ఇసుక, రాళ్లతో ఉంటుంది. ఈ ప్రదేశంలో రోడ్లేమీ ఉండవు. సహజ వనరులూ లేవట. అందుకేనేమో స్థిర నివాసులు లేరిక్కడ. పాపం... పక్కనున్న ప్రాంతాలు తమలో కలుపుకోవడానికీ ఇష్టపడటం లేదు.
* సాహసికులు మాత్రం ఇక్కడికి ఎలాగోలా చేరుకుని సరదాగా తమ పతాకాల్ని ఎగరేస్తూ ముచ్చట తీర్చుకుంటారు.
* అయితే దీని పక్కనే ఉన్న హలైబ్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని మాత్రం రెండు దేశాలూ ‘మాక్కావాలి మాక్కావాలి’ అంటూ పోటీపడతాయట. ఆ ప్రాంతం కూడా రాళ్లూరప్పలతో ఉన్నా దాని పక్కనే రెడ్ సీ ఉండటమే కారణం.

Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: