అనాథ శరణాలయంలో కొనసాగుతున్న తనిఖీలు బయటపడుతున్న అస్థిపంజరాలు
The bullet news(chennai)- తమిళనాడులోని ఉత్తిరమేరూరు సమీప బాలేశ్వరం గ్రామ పొలిమేరల్లో ఉన్న అనాథ శరణాలయంలో అధికారులు సోమవారం తనిఖీలు కొసాగించారు. ఈ తనిఖీల్లో అధిక సంఖ్యలో అస్థి పంజరాలు బయట పడుతుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూరు సమీప బాలేశ్వరం గ్రామ పొలిమేరల్లో సుమారు 19 ఎకరాల విస్తీర్ణంలో అనాథ శరణాలయం ఉంది. అక్కడ సుమారు 350 మంది వృద్థులు, మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఇదిలా ఉండగా అయిదు రోజల క్రితం అనాథ శరణాలయం నుంచి విజయకుమార్ అనే వ్యక్తి మృతదేహంతోపాటు అంబులెన్స్‌లో ఇద్దరు వృద్ధురాళ్లను తరలిస్తుండగా అన్నామ్మాళ్ అనే వృద్ధురాలు కాపాడంటి అంటూ కేకలు వేశారు. దీంతో అటు వైపు వెళుతున్న ఓ యువకుడు అంబులెన్స్‌ను అడ్డుకోగా వ్యానులోని వృద్ధులను కిందకు దింపిన స్థానికులు దానిని సాలవాక్కం పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలు అన్నమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టరు పొన్నయ్య ఆదేశాల మేరకు బాలేశ్వరం అనాథ శరణాలయానికి కాంచీపురం ఆర్డీవో రాజు నేతృత్వంలో ఆరుగురిని సభ్యుల అధికారుల బృందంతో వివిధ శాఖలకు చెందిన సుమారు 50 మంది సిబ్బంది నాలుగు రోజులగా ఆ శరణాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అనేక అక్రమాలను గుర్తించిన అధికారుల బృందం.. గత నెలలోనే 60 మంది వృద్ధులు మృతి చెందినట్లు విచారణలో తేల్చింది. అయితే మృతుల వివరాలు మాత్రం తెలియలేదు. శరణాలయం ఆవరణ వెనుక భాగంలో వీరి మృతదేహాలను పూడ్చడానికి, శవాలను నిల్వ ఉంచడానికి అక్కడే శవాగారాన్ని నిర్మించారు. అదేవిధంగా శవాగారం వెలుపల ప్రహరీకి సిమెంటుతో చిన్ని చిన్న పెట్టెలు నిర్మించారు. వీటిలోను వృద్ధుల మృతదహాలను ఉంచుతున్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా శవాలను దహనం చేస్తున్నందున ఈ ఆశ్రమ నిర్వాహకులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అస్థి పంజరాలతో పాటు అవయవాలను విదేశాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు సుమారు 1500 శవాలకు పైగా దహనం చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతి చెందిన వారి గురించి సరైన వివరాలు లేక పోవడంతో విచారణను ముందుకు సాగడం లేదని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో శవాగారం నుంచి అస్థి పంజరాలు బయట పడుతుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో రాజు నేతృత్వంలో సోమవారం మరోమారు తనిఖీలు కొనసాగించారు. ఈ తనిఖీల్లో ఎముకలు బయట పడ్డాయి. అధికారుల తనిఖీలు ముమ్మరం కావడంతో శరణాలయంలోని వృద్ధులు బయటకు వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంగా కలెక్టరు పొన్నయ్య సోమవారం విలేకరుతో మాట్లాడుతూ బాలేశ్వరం అనాథ శరణాలయంలో ప్రస్తుతం సుమారు 350 పైగా వృద్ధులు ఉన్నారని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 50 మంది సిబ్బందితో ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించి నివేదికను తమకు సమర్పించారని పేర్కొన్నారు. దీనికి గత ఏడాది నవంబరులోనే అనుమతి ముగిసిందని, ప్రతి నెలా 40 నుంచి 50 మంది వృద్ధులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం శరణాలయంలోని అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారని, వీరిలో కొందరు తాము ఎక్కడకి వెళ్లలో తెలియక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అధికారులు సమర్పించిన నివేదికను ప్రభుత్వానికి పంపామని, త్వరలో వృద్థులతోపాటు మానసిక వికాలాంగులను భద్రత ఉన్న శరణాలయాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శరణాలయం పనితీరు గురించి సోమవారం రెవెన్యూ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారని, అక్కడున్న సిబ్బంది, శరణాలయం నిర్వాహకుడు థామస్‌ను విచారిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నేర విచారణ చట్టం సెక్షను-133/బి ప్రకారం వివరణ ఇవ్వాలని ఆశ్రమ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని వివరించారు.
అనాథ శరణాలయంలో కొనసాగుతున్న తనిఖీలు బయటపడుతున్న అస్థిపంజరాలు
Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: