జగన్, మోడీ మధ్యలో పీకే
The bullet news ( Vijayawada)_
పాటు పడిన ప్రశాంత్ కిషోర్ మరోసారి తన సేవల్ని కాషాయ దళానికి అందించనున్నారు. ఆయన సేవల్ని మళ్లీ ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా పలుదఫాలు చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో మరోసారి మోడీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రానున్నారు. ఇప్పటికే తెరవెనక చర్చలు జరుగుతున్నాయి. 2014 బీజేపీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోరే. అయితే ఆ తర్వాత కాలంలో అమిత్ షాతో వచ్చిన విబేధాలతో ఆయన దూరమయ్యారు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల ఎన్నికలకు పీకే లేకుండానే బీజేపీ సొంత వ్యూహాలతో వెళ్లింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సేవల్ని మరోసారి ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పలుమార్లు చర్చలు జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ డీల్ కుదిరితే ప్రశాంత్ కిషోర్ ప్రధాని మోదీతో కలసి నేరుగా పనిచేయనున్నారు.
పొలిటికల్ స్ట్రాటిజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాతే బాహ్య ప్రపంచానికి పరిచయమయ్యారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేశారు. నాయకులకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం, పొలిటికల్ వ్యూహాలు, సభల్లో ఎలా మాట్లాడాలి, ఏ సందేశం ఇవ్వాలి, సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయాలి వంటి అంశాల్లో సేవలు అందిస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ కు వ్యూహకర్తగా వ్యవహరించి విజయంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీ ఎన్నికల్లో ఆయన సేవలు తీసుకుంది. పంజాబ్ లో అమరీందర్ సింగ్ కూడా ప్రశాంత్ కిషోర్ ను సేవలు వాడకున్నారు. ఇటు ఏపీలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ను మోడీ సెంటిమెంట్‌గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: