రూ.5 కోట్ల భూమికి ఎసరు!
The bullet news(nellore)- మా తాతల కాలం నుంచి సర్వే నెంబరు 23లో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. గత రెండేళ్లుగా సరిగా వర్షాలు పడకపోవడంతో ఆ భూమిని దున్నలేదు. గత కొన్ని రోజుల నుంచి శ్రీహరికోటలోని షార్ నిర్వాసితులమంటూ కొందరు వచ్చి తమకు ఇష్టం వచ్చినట్లు భూములను ఆక్రమించుకుని చుట్టూ రాళ్లు పాతి కంచె వేస్తున్నారు. రాత్రికి రాత్రే లారీలు తీసుకువచ్చి రిగ్‌తో బోర్లు వేస్తున్నారు. ఆక్రమించుకున్న భూమిలో అప్పటికప్పుడే కట్టడాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లోనే రెవెన్యూ అధికారుల సహకారంతో ఇలాంటి పనులు జోరుగా సాగుతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు’
దొరవారిసత్రం మండలంలోని అక్కరపాక రెవిన్యూలో సర్వే నెంబరు 23లో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కొన్నేళ్లుగా స్థానిక గిరిజనులు కొందరు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 1970లో శ్రీహరికోట నిర్వాసితులు కొందరికి నివాసిత స్థలాలను పంపిణీ చేశారు. దీనికోసం సర్వే నెంబరు 23ను సబ్ డివిజన్ చేసి 305గా మార్చారు. అప్పట్లో సుమారు 20 ఎకరాలను నివాస స్థలాల కోసం కేటాయించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన భూమిని కాలనీకి చెందిన ఎస్టీలు సాగు చేసుకుని జీవనం సాగించేవారు. ఈ భూములు జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో కొందరు దీన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. అప్పట్లో స్థలాల కోసం కేటాయించిన భూమితోపాటు పక్కనే మిగిలి ఉన్న భూములను కూడా శ్రీహరికోట నిర్వాసితులకు ఇచ్చినవేనంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఇలా ఆక్రమణలకు గురవుతున్న సుమారు 30 ఎకరాల భూమి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. తహసీల్దారు కార్యాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఎకరం భూమిని సాగు చేసుకునే వాళ్లం
కోట్లపాటి వరాలు, స్థానికుడు
మా తాతల కాలం నుంచి ఇక్కడ ఎకరం భూమిని సాగు చేసుకుని జీవించే వాళ్లం. వర్షాలు సరిగా పడకపోవడంతో కొన్నేళ్లుగా ఆ భూములను సాగు చేయక బీడుగా మారాయి. ఇప్పుడు కొందరు వచ్చి మాకు ప్రభుత్వం ఇచ్చిందంటూ ఏవో కాగితాలు చూపించి ఆక్రమించుకుని రాళ్లు నాటుకుంటున్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం ఇస్తే రాత్రివేళల్లో పనులెందుకు?
మూల రాజమ్మ, స్థానికురాలు
శ్రీహరికోట నిర్వాసితులకు ప్రభుత్వం భూమి ఇచ్చి ఉంటే వారు పగలే పనులు చేసుకోవచ్చు కదా? దొంగల్లాగా రాత్రి వేళల్లో వచ్చి రాళ్లు నాటడం, కంచె వేయడం వంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఆదివారం రాత్రి బోరు లారీ తీసుకువచ్చి నాలుగు చోట్ల రిగ్‌బోర్లు కూడా వేశారు. వీరికి అధికారుల సహకారం కూడా ఉంది.
ఇంటి స్థలాలు లేని పేదలెంతో మంది ఉన్నారు
కోట్లపాటి వెంకటయ్య, స్థానికుడు
మా కాలనీలో ఇంటి స్థలాలు లేక ఒకే ఇంట్లో రెండు మూడు జతల కుటుంబాలు చొప్పున కాపురాలు ఉంటున్నాం. మాకు ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు ఇవ్వమంటే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం వీరికి ఒక్కొక్కరికి 10 సెంట్లు చొప్పున ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వీరికి ఇచ్చిన భూములతోపాటు పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు అన్ని తెలిసి ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే రూ.కోట్ల విలువ చేసే భూమి అన్యాక్రాంతమవుతుంది.
విచారించి చర్యలు తీసుకుంటాం
డి.ఎస్.వెంకటేశ్వరరావు, తహసీల్దారు
కృష్ణాపురంలో శ్రీహరికోట నిర్వాసితులకు, స్థానిక గిరిజనులకు మధ్య నెలకొన్న భూ వివాదం నా దృష్టికి కూడా వచ్చింది. గతంలో కొంత భూమిని శ్రీహరికోట నిర్వాసితులకు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ దానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా లేవు. దీనిపై విచారణ జరిపి భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నవారిపై కేసులు నమోదు చేస్తాం.
30.7 ఎకరాల్లో పట్టాలు మంజూరు చేశారు
కోదండరామిరెడ్డి, శ్రీహరికోట ఐల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ (సిల్లా), అధ్యక్షుడు
శ్రీహరికోటలో భూములు కోల్పోయినవారికి 1970లో సుమారు 306 మందికి నివాస స్థలాల కోసం కృష్ణాపురంలోని సర్వే నెంబరు 23ను సబ్‌డివిజన్ చేసి సర్వే నెంబరు 305గా మార్చి 30.7 ఎకరాల భూమిని మంజూరు చేశారు. ప్రతి ఒక్కరికి పది సెంట్లు చొప్పున పట్టాలు మంజూరు చేశారు. వీరందరూ ఎక్కడెక్కడో ఉండి చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఒక్కొక్కరుగా వచ్చి తమకు ఇచ్చిన భూములను చదును చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించడంలేదు.
- అక్కరపాక పంచాయతీలోని కృష్ణాపురం గిరిజన కాలనీవాసుల వాదన ఇది.

Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: